Asianet News TeluguAsianet News Telugu

ఆకట్టుకుంటున్న ‘కృష్ణ వ్రిందా విహారి’ ట్రైలర్.. అదుర్స్ అనిపిస్తున్న నాగశౌర్య పెర్ఫామెన్స్.!

యంగ్ హీరో నాగశౌర్య (Naga Shourya) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ విడుదలైంది. కొత్త లుక్ తో నాగశౌర్య పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటోంది. సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. 
 

Impressive trailer of Krishna Vrinda Vihari!
Author
First Published Sep 10, 2022, 5:57 PM IST

టాలెంటెడ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘కృష్ణ వ్రిందా విహారి’ (Krishna Vrinda Vihari). ఎప్పుడో ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర  యూనిట్ జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అదిరిపోయే అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగ్ తోప్రేక్షకుల్లో ఎక్సపెక్టేషన్స్ పెంచేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ తోనూ ఆకట్టుకుంటున్నారు. చిత్ర ట్రైలర్ ఎంటర్ టైనింగ్ ఉంది. నాగశౌర్య సూపర్ కూల్‌ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. 

తాజాగా రిలీజ్ అయినా ఈ ట్రైలర్ ప్రారంభ సన్నివేశంతోనే ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర కథను చెప్పిన తీరు మరింత ఆసక్తికరంగా ఉందది. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా చిత్రం ప్రేక్షకులు చూడలేదనే చెప్పాలి. టేకింగ్ చాలా కొత్తగా కనిపిస్తోంది. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు ప్రస్తుత చిత్రాలతో పోల్చితే చాలా రిఫ్రెషింగ్ గా కనిపించాయి. అలాగే విజువల్స్, సౌండ్స్, పాటలు అద్భుతంగా అనిపించాయి. హీరో నాగ శౌర్య కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. పెర్ఫామెన్స్ కూడా గత సినిమాలతో  పోల్చితే ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరో వైపు హీరోయిన్ పెర్ఫామెన్స్ కూడా ఆకట్టుకుంటోంది. వీరిద్దరి కెమిస్ట్రీ, రొమాన్స్ ట్రైలర్ లో హైలెట్ గా చెప్పొచ్చు. 

కీలక పాత్రల్లో నటించిన నటి రాధికా, బ్రహ్మాజీ అదరగొట్టినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరోవైపు పైట్ సీన్స్, డైలాగ్స్ కూడా కంటెంట్ కు తగ్గట్టుగా రాసినట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేది ఈ చిత్ర ట్రైలర్ సూచిస్తోందది. ఇప్పటికే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం ఎట్టకేళలకు రిలీజ్ కు సిద్ధమవుతోంది. చిత్రంలో నాగ శౌర్య, షిర్లీ సెటియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ కీలక పాత్రలను పోషించారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మించారు. సెప్టెంబర్ 23న రిలీజ్ కానుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios