తమిళ హాస్యనటుడి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగలు, డబ్బుని దొంగిలించారు. 

ఓ ఛానెల్ నిర్వహిస్తోన్న రియాలిటీ కామెడీ షోతో తమిళ ప్రజలకు పరిచయమైన ఇమ్మాన్ అన్నాచ్చి అనే కమెడియన్ 'వేటైకారాన్', 'మరియన్', 'పులి' వంటి చిత్రాల్లో నటించారు. చెన్నైలోని అరుంబాక్కం రాజీవ్ గాంధీ వీధిలో నివసిస్తోన్న ఇతడు షూటింగ్ కోసం విదేశాలకు వెళ్తుంటారు.

ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో కుటుంబంతో కలిసి ఆయన సొంతూరు వెళ్లారు. బుధవారం నాడు ఇంటికి వచ్చిన ఆయన బీరువాలో దాచిన నగలు, డబ్బు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో అతడు పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.