ఇలియానా.. ఒకప్పుడు కుర్రకారుని ఊపేసిన పేరిది. దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరి చిత్రంతో సెన్సేషనల్ గా మారిపోయింది. ఈ నడుము సుందరి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టారు. దాదాపు 6ఏళ్లకు పైగా ఇలియానా టాలీవుడ్ లో తిరుగులేని హీరోయిన్ గా మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ సరసన నటించింది. 

టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న సమయంలోనే సౌత్ చిత్రాలకు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. కానీ ఇలియానాకు ఆశా భంగమే కలిగింది. బాలీవుడ్ లో ఎక్కువకాలం నిలబడలేకపోయింది. దీనితో టాలీవుడ్ దర్శకులు కూడా ఆమెని మరచిపోయారు. గత ఏడాది రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో నటించింది. ఆ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

ప్రస్తుతం మళ్ళీ సౌత్ లో పుంజుకునేందుకు ఇలియానా తన సర్కిల్స్ లో గట్టి ప్రయత్నాలే చేస్తోందట. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార, తమన్నా లాంటి ఇలియానా జనరేషన్ బ్యూటీ లని వెతుకుతున్నారు. 

నయనతార, తమన్నా కొరటాల చిత్రంలో నటించబోవడం లేదనే వార్తలు రావడంతో ఇలియానా ఆ అవకాశాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట. వెంటనే తన మేనేజర్ ని కొరటాల శివ వద్దకు పంపి ప్రాధమిక చర్చలు జరిపినట్లు టాక్. రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు లేవని ఎలాగైనా ఈ చిత్రంలో ఛాన్స్ దక్కితే చాలానే ఉద్దేశంతో ఇలియానా ఉన్నట్లు తెలుస్తోంది. 

కొరటాల శివ, చిరు ఈ గోవా బ్యూటీ పేరుని పరిశీలిస్తారో లేదో చూడాలి.