బన్నీతో రొమాన్స్ కు ఓకే చెబుతుందా..?

ileana to act with bunny again
Highlights

అల్లు అర్జున్ నటించిన 'జులాయి' సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇలియానా. ఈ సినిమా తరువాతే టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ కు రావడంతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తను బన్నీతో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను తీసుకోవాలని అనుకుంటున్నాడట

గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈ భామ బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తెలుగులో మంచి పీక్ పొజిషన్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ 'బర్ఫీ' చిత్రంతో కెరీర్ మొదలుపెట్టిన ఇల్లీ బేబీకి ఆశించిన విధంగా అవకాశాలు మాత్రం దక్కలేదు. అయినప్పటికీ అక్కడే ఉంటూ ప్రయత్నాలు చేస్తోంది.

ముంబై నుండి టాలీవుడ్ కు వచ్చే ఛాన్స్ లేదంటూ చెప్పుకొచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు సినిమాలలో అవకాశాలకు ఓకే  చెబుతోంది. ఈ క్రమంలో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే సినిమా షూటింగ్ లో జాయిన్ అయింది ఈ బ్యూటీ. ఇప్పుడు టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ సినిమా కోసం ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ నటించిన 'జులాయి' సినిమాలో హీరోయిన్ గా నటించింది ఇలియానా. ఈ సినిమా తరువాతే టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. ఇప్పుడు మరోసారి టాలీవుడ్ కు రావడంతో దర్శకుడు విక్రమ్ కె కుమార్ తను బన్నీతో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను తీసుకోవాలని అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి మరోసారి బన్నీతో రొమాన్స్ కు ఈ బ్యూటీ ఓకే చెబుతుందేమో చూడాలి!

loader