ఇదేం బొడ్డులో పద్ధతో అర్థం కావట్లేదు

First Published 20, Feb 2018, 3:52 PM IST
ileana sensational comments on south film makers
Highlights
  • దక్షిణాది ఫిల్మ్ మేకర్స్ పై ఇలియానా కామెంట్స్
  • బొడ్డు అందాల ప్రదర్శన ఎందుకో తనకు అర్థం కాలేదన్న ఇలియానా
  • అందం తప్ప దక్షిణాది హిరోయిన్లకు మరే గుర్తింపు వుండదన్న బెల్లీ బేబీ

గోవా బ్యూటీ ఇలియానా తెలుగు జనాన్ని ఏ రేంజిలో ఫ్లాట్ చేసిందో తెలిసిందే. ఇలియానా నడుము అందాలపై ఏకంగా ఇలియానా బెల్లియానా అంటూ ఓ పాటనే వచ్చిందంటే ఇలియానా నడుం ఒంపుల సౌందర్యం, దాన్ని ప్రదర్శించిన తీరు.. ఆడియన్స్ బాగానే ఫిదా అయ్యారు. అయితే.. టాలీవుడ్ కెరీర్ పీక్స్ లో వున్న సమయంలో ఇల్లీ బేబీ.. బెల్లీ చుట్టేసి బాలీవుడ్ కు వెళ్లి పోయింది. అడపాదడపా అక్కడ కొన్ని సినిమాల్లో మెరుస్తోంది. ఆఫర్ల కరువుతో ఏకంగా నగ్నంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బెల్లీ బేబీ తాజాగా సౌత్ ఫిల్మ్ మేకర్స్ పై హాట్ కామెంట్స్ చేసింది.

 

పూరీ దర్శకత్వంలో వచ్చిన “దేవుడు చేసిన మనుషులు” తర్వాత ఇల్లీ బేబీ మళ్లీ తెలుగులో నటించలేదు. కానీ గతంలో ఓ సారి.. ఇప్పుడు మళ్లీ దక్షిణాది ఫిలిం మేకర్స్ పై గట్టిగానే పంచ్ లు పేల్చింది. ఇటీవల దక్షిణాది సినిమాల్లో అందాల ప్రదర్శనే ముఖ్యం అంటూ తాప్సీ పన్ను కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

 

ఇప్పుడు ఇలియానా కూడా ఇలాంటి కామెంట్స్ నే చేసింది. తన మొదటి సినిమా దేవదాసులో.. మొదటి షాట్ చిత్రీకరించే సమయంలోనే.. బొడ్డుపై శంఖం వేశారట. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగితే.. దర్శకుడు(వైవీఎస్ చౌదరి) ఇలా చేయడం చాలా అందంగా ఉంటుంది అని చెప్పాడట. నీకు చాలా అందమైన నడుము ఉంది.. ఇలా చేస్తే గుర్తింపు వస్తుంది అన్నాడట. 
 


అలా ఎందుకు చేయాలో తనకు ఇప్పటికీ అర్ధం కాలేదన్న ఇలియానా.. ఇప్పటికీ బొడ్డు విషయంలో దక్షిణాది సినిమాలు ఇదే తరహాగా ఉన్నాయని చెబుతోంది. అందం యాంగిల్ లో తప్ప సౌత్ సినిమాల్లో హీరోయిన్స్ కు గుర్తింపు ఉండదని చెప్పిన ఇలియానా.. నార్త్ లో మాత్రం తనకు అలాంటి పరిస్థితి ఇప్పటివరకూ ఎదురుకాలేదని తెలిపింది. ఇంతకీ ఏకంగా ఇలియనా బెల్లియానా అంటూ పాటలో బెల్లీ డాన్స్ లతో కిరాక్ పుట్టించిన ఇలియానా ఇలా ప్లేటు ఫిరాయించి మాట్లాడటం వెనకున్న మతలబు ఏంటో.

loader