Asianet News TeluguAsianet News Telugu

ఇలియానాకు ఎంత కష్టం వచ్చిందో!

హిందీకు వెళ్లి ‘బర్ఫీ’, ‘మైనే తేరే హీరో’, ‘రుస్తుం’, ‘బాద్‌షా హో’... సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొత్త నీరు వచ్చేసింది. ఇలియానా ..బాలీవుడ్ కు వెళ్లటం, ఇక్కడ ఆమె చేసిన తెలుగు సినిమాలు ప్లాఫ్ కావటం ఆమె కెరీర్ పై ఇంపాక్ట్ చూపించాయి. ‘కంఫర్ట్‌ జోన్‌ నుంచి రావడానికే ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం సాధ్యపడుతుంది’ అని చెప్పే ఇలియానా ఇప్పుడు ఎక్కడా పెద్దగా ఆఫర్స్ లేని పరిస్దితి. 

Ileana Seems to Be Desperate for Tollywood Comeback
Author
Hyderabad, First Published Jul 30, 2020, 7:55 PM IST

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఇలియానా ఓహో అనే స్దాయిలో ఓ వెలుగు వెలిగిపోయిన విషయం తెలిసిందే. ‘దేవదాసు’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘తెలుగింటి అమ్మాయి’గా పేరు తెచ్చుకున్న ఇలియానా ఆ తర్వాత స్టార్స్ అందరితో చేసింది. తర్వాత హిందీకు వెళ్లి ‘బర్ఫీ’, ‘మైనే తేరే హీరో’, ‘రుస్తుం’, ‘బాద్‌షా హో’... సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొత్త నీరు వచ్చేసింది. ఇలియానా ..బాలీవుడ్ కు వెళ్లటం, ఇక్కడ ఆమె చేసిన తెలుగు సినిమాలు ప్లాఫ్ కావటం ఆమె కెరీర్ పై ఇంపాక్ట్ చూపించాయి. ‘కంఫర్ట్‌ జోన్‌ నుంచి రావడానికే ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం సాధ్యపడుతుంది’ అని చెప్పే ఇలియానా ఇప్పుడు ఎక్కడా పెద్దగా ఆఫర్స్ లేని పరిస్దితి. 

వచ్చినా ఒకటి అరా..అవి చాలా చిన్న బ్యానర్స్ నుంచి గుర్తింపు లేని డైరక్టర్స్ నుంచి. దాంతో ఆమె బాలీవుడ్ ని ప్రక్కన పెట్టేసి, తనకు లైఫ్ ఇచ్చిన తెలుగు వైపే చూస్తోంది. అయితే ఇక్కడ ఆమె ను పట్టించుకునే వాళ్లు ఎవరూ కనపడటం లేదు. చివరకు ఐటం సాంగ్,స్పెషల్ సాంగ్స్ కూడా చేయించుకునే వాళ్లు లేరు. అందుకు కారణం ఆమె క్రేజ్ తగ్గటం మాత్రమే కాదు..ఆమె రెమ్యునేషన్ కూడా అని చెప్తారు. ఈ విషయం ఇలియానా కూడా గుర్తించింది. దాంతో గతంలో సీనియర్ హీరోల ప్రక్కన చేయటానికి అనే మాటకే దూరం అని బిల్డప్ ఇచ్చిన ఇలియానా ఇప్పుడు నాగార్జున్ కొత్త చిత్రంలో చేయటానికి ఆసక్తి చూపుతోందని సమాచారం. ఈ మేరకు తను రెమ్యునేషన్ బాగా తగ్గించుకుంటానని మేనేజర్ చేత కబుర్లు మీద కబుర్లు పంపుతోందని టాలీవుడ్ టాక్. అలాగే ఆ మధ్య కాస్త బరువు పెరిగానని దీంతో కొందరు రకరకాలుగా విమర్శలు చేశారని తెలిపింది. 

దీంతో తీవ్రంగా కసరత్తులు చేసి ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా యథాస్థితికి మారినట్లు  తెలిపింది. తాను నిత్యం వ్యాయామం చేస్తారని తెలిపింది. ఆన్‌లైన్లో చూసి రకరకాల వ్యాయామాలు చేస్తానని చెప్పింది.అయితే నాగ్ ఆమెతో చేయటానికి ఎంతవరకూ ఆసక్తి చూపెడతారనేది సమస్య. ఇంతకీ నాగ్ తో ఏ సినిమాలో అంటే ప్రవీణ్ సత్తారు ఆయన త్వరలో చేయబోయే సినిమాలో అని చెప్తున్నారు. ఇలియానా కెరీర్ ని మెదటి నుంచి గమనించిన వారు మాత్రం ఇల్లి బేబికి ఎన్ని కష్టాలు వచ్చాయి అని నిట్టూరుస్తున్నారు. ఇలియానా చివరగా రవతేజ సరసన అమర్ అక్బర్ ఆంధోని సినిమాలో చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios