సోషల్ మీడియాలో గోవా బ్యూటీ ఇలియానా ఆగ్రహం తాను మహిళనేనని, అవమానపరిచే హక్కు ఎవరికీ లేదని ట్వీట్ ఓ అభిమాని అసభ్య ప్రవర్తనపై సోషల్ మీడియాలో స్పందించిన ఇల్లీ

దేవ‌దాసు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. అన‌తికాలంలోనే స్టార్‌డ‌మ్ సంపాదించిందిన గోవా బ్యూటీ ఇలియానా పలువురు స్టార్ హీరోలతో హిట్ సినిమాల్లో నటించింది. ఇక్కడ కెరీర్ పీక్స్ లో వున్నప్పుడు బాలీవుడ్ బాట పట్టడంతో.. తెలుగులో ఆఫర్లు కరువైపోయాయి. బాలీవుడ్‌లో అప్పుడో ఇప్పుడో అన్నట్టు ఒకటో అరో సినిమాలు చేస్తూ నెట్టుకొస్తోంది. అక్కడ అంత పెద్ద‌గా క్రేజ్ కూడా రాలేదు.

ఇటీవల ఓ వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా వ్యవహరించాడట. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించిన ఇలియానా.. అతని స్వభావంపై తీవ్రంగా మండిపడింది. 'మనం నివసిస్తున్నది చాలా సంకుచితమైన, అల్పమైన ప్రపంచం. నేనొక పబ్లిక్‌ ఫిగర్‌ని. బహిరంగ ప్రదేశాల్లో నాకు పెద్దగా వ్యక్తిగత జీవితం ఉండదని తెలుసు. కానీ, అంతమాత్రాన నాతో అసభ్యంగా ప్రవర్తించే హక్కు ఎవరికీ లేదు. ఈ విషయంలో మీ వికారాలను నాపై చూపకండి. నేనూ ఒక మహిళనే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి' అంటూ ఇలియానా ఘాటుగా ట్వీట్‌ చేసింది.

Scroll to load tweet…
Scroll to load tweet…

టాలీవుడ్‌లో అగ్రతార వెలుగొందిన ఆమె ఆఫర్లు లేక తెలుగు పరిశ్రమకు దూరమైంది. టాలీవుడ్‌కు దూరమైన ఇలియానా బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నది. గత కొద్దికాలంగా హాట్ హాట్‌గా ఫొటో షూట్‌లకే పరిమితమైంది.ఒకప్పుడు వరుస తెలుగు సినిమాలతో అలరించిన ఇలియానా ఇప్పుడు బాలీవుడ్‌కు పరిమితమయింది. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో ఇటువైపు చూడటం మానేసిన ఈ అమ్మడు వరుసగా హిందీలో అవకాశాలను అందుకుంటోంది.

ప్రస్తుతం ఇలియానా నటించిన 'బాద్‌షాహో' సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. అజయ్‌ దేవగన్, ఇమ్రాన్‌ హష్మీ, ఈషా గుప్తా ప్రధాన పాత్రల్లో మిలాన్‌ లుథ్రియా రూపొందించిన ఈ సినిమాపై ఇలియానా గంపెడాశలు పెట్టుకుంది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి