మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజీ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. అలాగే, తెలుగు తేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. కాగా, ఈ ఏడాది ముగ్గురికి పద్మ విభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్, 72 మందికి పద్మశీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 

రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 41 మందికి ‘పద్మ’ పురస్కారాలను ప్రదానం చేయడం జరిగింది. మిగిలిన వారికి వచ్చే నెల 2న పద్మ పురస్కారాలను అందజేయనున్నారు. జరిగిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు