ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తుకి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన్ను చిక్కులోకి నేట్టేసాయి. నిజానికి ఇళయరాజా పాల్గొన్న కార్యక్రమానికి దీనికి ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఆయన మాత్రం ఏసుక్రీస్తుపై కామెంట్ చేయడం ఇప్పుడు వివాదాలకు దారి తీస్తోంది. ఏసుక్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి లేచారని క్రైస్తవులు నమ్ముతారు. 

కానీ దానిలో నిజం లేదని అలా మరణించి తిరిగి లేవడమనేది ఒక్క రమణ మహర్షికి మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు. దీంతో క్రైస్తవ సంఘాలు ఇళయరాజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని చెన్నై కమీషనర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేశారు. ఇళయరాజాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో ఇళయరాజాపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం  ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడు ఇళయరాజా ఏం చేస్తాడో చూడాలి!