సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించి, దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఘనత ఇళయరాజాది.
ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయ రాజా జీవితంపై ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త బయటకు వస్తోంది. ఇప్పటివరకూ మనకు వచ్చిన వార్తలను బట్టి ఇళయరాజా పాత్రలో ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్ నటించనున్నాడు. అలాగే దర్శకుడుగా హిందీ దర్శకుడు బల్కినీ అనుకున్నట్లు చెప్పారు. అయితే ఇప్పుడు దర్శకుడు మారినట్లు సమాచారం. ఆ దర్శకుడు ఎవరు అంటే...
కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించే ఈ చిత్రం రేపు అంటే మార్చి 20 న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే కంటిన్యూ షెడ్యూల్ది అక్టోబర్ నుంచి జరపనున్నట్లు తెలుస్తోంది. అలాగే 2025లో విడుదల చేయాలని చిత్రటీమ్ భావిస్తోంది.ఇక దర్శకుడుగా బల్కి కాదని రీసెంట్ గా ధనుష్ ని హీరోగా పెట్టి కెప్టెన్ మిల్లర్ సినిమా చేసిన డైరక్టర్ అరుణ్ మాథేశ్వరన్ ని ఈ ప్రాజెక్టుకి ఎంపిక చేసినట్లు సమాచారం. అరుణ్ మాథేశ్వరన్ తో ధనుష్ కు కెప్టెన్ మిల్లర్ సమయంలో మంచి అనుభందం ఏర్పడింది. దాంతో తో ఆ దర్శకుడునే ఈ సినిమాకు న్యాయం చేస్తారని భావించి ఈ నిర్ణయం తీసుకన్నట్లు తమిళ మీడియా అంటోంది. అయితే ఈ విషయమై ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో చాలా మంది తమిళ,తెలుగు హీరోలు గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు.
సుమారు7 వేలకు పైగా పాటలకు సంగీతం అందించి, దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిన ఘనత ఇళయరాజాది. అలాంటి దిగ్గజ సంగీత దర్శకుడి జీవిత విశేషాల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రానికి ‘ఇసైజ్ఞాని’ అనే టైటిల్‌ని పెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన వెంటనే ఇళయరాజా, ధనుష్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి .ఇళయరాజా సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఈ సినిమాలో వివరించనున్నారు. ఇళయరాజా పాత్రలో ధనుష్‌ని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇళయ రాజా సంగీత సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్, పద్మవిభూషణ్, సంగీత నాటక అకడమిక్ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంత చేసుకుకున్నారు. ఇక 50 ఏళ్లలో 20 వేలకు పైగా కచేరీలు పూర్తి చేసిన ఏకైక సంగీత విద్వాంసుడు ఇళయరాజా. రజనీ, కమల్, చిరంజీవి, మెహన్ బాబు, బాలకృష్ణ వంటి అగ్రహీరోలకు ఎన్నో హిట్ సాంగ్స్ అందించారు. గతంలో ఇళయరాజా బయోపిక్‌లో నటించేందుకు రజనీకాంత్ చర్చలు జరిపారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో హీరో ధనుష్ వచ్చాడు.
