సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన 'మహర్షి' సినిమా భారీ వసూళ్లను సాధించింది కానీ సినిమా చాలా మంది అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి సమయంలో మహేష్ బాబు.. వంశీతో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని తెలియగానే అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

సెలబ్రేటింగ్ 'మహర్షి' అంటూ సోషల్ మీడియాలో మహేష్, వంశీ పెడుతోన్న పోస్ట్ లపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. తాజాగా మహేష్ బాబు లండన్ కి ట్రిప్ కి వెళ్లాడు. మహేష్ ఫ్యామిలీతో పాటు వంశీ పైడిపల్లి ఫ్యామిలీ కూడా వెళ్లింది. అక్కడ వీరు తీసుకున్న ఓ ఫోటోని మహేష్ బాబు షేర్ చేశాడు.

ఆ ట్వీట్ ని వంశీ పైడిపల్లి రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన మహేష్ ఫ్యాన్స్ వంశీపై సెటైర్లు వేస్తున్నారు.. 'అన్నా నీకో దండం.. ఒక కల్ట్ సినిమా ఇస్తావనుకుంటే అదే మెసేజ్ మూవీ ఇచ్చావ్.. ఇంకో మూవీ చేయకు' అని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు 'ఇంకా మా మహేష్ ని వదలవా..?' అంటూ మండిపడుతున్నారు.

గతంలో 'దూకుడు' సినిమా హిట్ అయిందని శ్రీనువైట్లకి ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్న మహేష్ మరోసారి వంశీతో సినిమా తీసి ఇలాంటి అనుభవమే పొందుతాడేమోనని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా మహేష్ బాబు ఇలా ఫోటోలు షేర్ చేయడం మానేసి.. తన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తాడేమో చూడాలి!