Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ ఖాన్ పాటను హమ్ చేస్తున్న అల్లు అయాన్, ఎంత బాగా పాడాడో...

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ చాలా మంది ఉన్నారు కాని.. అందరూ పాపులర్ అవ్వాలని లేదు. అవుతారని కూడా లేదు. కాని కొందరు మాత్రం చిన్నతనం నుంచే సొంత ఇమేజ్ తో దూసుకుపోతున్నారు. అందుకోసం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుగట్టిగా వాదేస్తున్నారు. 

Icon Star Allu Arjun Son Allu Ayaan Singh Shahrukh Khan Song Viral Video JMS
Author
First Published Feb 25, 2024, 6:54 AM IST | Last Updated Feb 25, 2024, 7:22 AM IST


ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కు కొదవ లేదు. కాని అందులో ఎంతమందికి ఇండస్ట్రీలో నిలబడేంత స్టఫ్ ఉంది అనేది చిన్నతనంలోనే తేలిపోతోంది. మన హీరోలు పెరిగి పెద్దవారు అయ్యాక హీరోలుగా నిలబడటానికి నానా తిప్పలు పడి.. తమను తాము నిరూపించుకుంటే.. కొంత మంది స్టార్ కిడ్స్ చిన్నతనంలోనే తమ సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటూ.. ఇండస్ట్రీలో ముందే కర్చీఫ్ వేసుకుంటున్నారు. ఈ విషయంలో  మహేష్ బాబు కూతురు సితార తో పాటు.. అల్లు అర్జున్ పిల్లలు ఇద్దరు ముందున్నారు. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్.. కూతురు అర్హా కూడా ఇండస్ట్రీలో పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే అర్హ ఓ సినిమా చేసింది. సోషల్ మీడియాలో వీడియోలతో అదరగొడుతోంది. అటు అయాన్ కూడా  సినిమాల్లోకి రాకుముందే మంచి పాపులారిటీని సంపాదించుకుంటాడు. దాదాపు 10 ఏళ్ళ వయసు ఉన్న అయాన్.. తన అల్లరితో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాడు. తను చేసే చిలిపి పనులకు అల్లు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతుంటారు. ఇక అయాన్ అల్లరికి అభిమానుల తెగ ఖుషీ అవుతుంటారు.  

ఈక్రమంలో అల్లు అయాన్‌ని  మోడల్ అంటూ ముద్దుగా పిలుచుకోవడం స్టార్ట్ చేసారు.ఇక అభిమానులతో పాటు బన్నీ కూడా అయాన్ ను మోడల్ అయాన్ అనే పిలుస్తున్నాడట.  ఇక ఇది ఇలా ఉంటే  తాజాగా అయాన్ కు సబంధించిన మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయాన్ పాటపాడుతున్నాడు అది కూడా తెలుగు పాట కాదు హిందీ సాంగ్.  షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాలోని ‘లుటు పుటు గయా’ పాటని.. పాడుతుండగా తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

 అల్లు అయాన్ సరదాకి హమ్ చేసినా.. పాట మాత్రం బాగా పాడాడు. దాంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. రకరకాల కామెంట్లుపెడుతున్నారు. కొంత మంది మీ డాడీ సాంగ్ పాడవచ్చు కదా అని అంటుంటే.. మరికొందరుమాత్రం ఫ్యూచర్ ఐకాన్ స్టార్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇంకొందరు షారుఖ్ ఖాన్ కు ఈ వీడియో ట్యాక్ చేస్తున్నారు. మరి ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios