హిట్ కాంబినేషన్ మళ్ళీ మళ్ళీ హిట్ అయితే.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతుంటారు..? అలాంటి కాంబినేషన్లలో బన్నీ, పూజా హెగ్డే జోడీ ఒకటి. ఈ కాంబో మరోసారి వెండితెరపై సందడి చేయబోతుంది.  

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకకు భారీ క్రేజ్ ఉంటుంది. ఆ కాంబినేషన్ మరోసారి మరోసారి అంటూ.. పలుమార్లు రిపీట్ అయితే.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతుంటారు. అలాంటి కాంబినేషన్లలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పూజా హెగ్డే కాంబో కూడా ఒకటి. సినీ పరిశ్రమలో హీరో – హీరోయిన్ లేదా హీరో – డైరెక్టర్ కాంబినేషన్లు రిపీట్ అవడం అనేది మామూలే. సినిమాల రిజల్ట్ బట్టి అదే కాంబినేషన్ మరో సారి చూడాలని ఆడియన్స్ కూడా ఆశపడుతుంటారు. అలాంటి ప్రయత్నమే అల్లు అర్జున్ – పూజా హెగ్డే జోడీ పై జరగనుందని టాక్. 

అయితే ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే.. ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి బాలేదు. చేసిన సినిమాలన్నీ ధారుణంగా ప్లాప్ అవుతున్నాయి. దాంతో ఆమెకు అవకాశాలే లేవు.. అటువంటిది పూజాహెగ్డేకు అల్లు అర్జున్ అవకాశం ఇచ్చే ధైర్యం చేస్తాడా అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప: ది రూల్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ చేయబోతున్నారు. 

ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా తరువాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే లిస్ట్ లో అట్లీ, సందీప్ రెడ్డి వంగా..బోయపాటి శ్రీను.. త్రివిక్రమ్ లాంటివారు ఉన్నారు. అయితే విశ్వసనీయ వర్గాలు సమాచారం ప్రకారం. బన్నీ సినిమా అట్లీతో చేయబోతున్నట్టు తెలుస్తోంది. ముందుగా అట్లీతో సినిమా చేసిన తరువాత.. మిగతావారికి టైమ్ ఇవ్వాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారట. అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను తీసుకున్నట్టు తెలుస్తోంది.

పూజా గతంలో అల్లు అర్జున్‌తో కలిసి డీజే, అల వైకుంఠపురంలో సినిమాలలో నటించారు. కాగా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ముఖ్యంగా అల వైకుంఠపురంలో సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల వైరల్ అవుతున్న వార్తలే నిజమైతే.. ఆమెకు మూడో సారి అల్లు అర్జున్ సరసన హీరోయిన్ అయ్యే అవకాశం కొట్టేసినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే ఈ విషయం పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి ముచ్చటగా మూడోసారి వీరి కాంబో కలిస్తే.. అది హిట్ అవుతుందా..? లేక పూజా ప్రభావం కనిపిస్తుందా అనేది చూడాలి. అసలు వీరు కలవడం జరుగుతందా అనేది కూడా చూడాలి.