అట్లీతో అల్లు అర్జున్.. అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్..?
కొన్ని కాంబినేషన్లలో సినిమాలు సడెన్ గా సెట్ అవుతాయి..ఆస్టార్ హీరో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తాయి. కొన్నిమాత్రం ముందు నుంచే ఊరిస్తూ ఉంటాయి. అటువంటి కాంబోనే ఒకటి వైరల్ అవుతుంది.

కొన్ని కాంబినేషన్లలో సినిమాలు సడెన్ గా సెట్ అవుతాయి..ఆస్టార్ హీరో ఫ్యాన్స్ ను దిల్ ఖుష్ చేస్తాయి. కొన్నిమాత్రం ముందు నుంచే ఊరిస్తూ ఉంటాయి. అటువంటి కాంబోనే ఒకటి వైరల్ అవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ ఇద్దర కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ.. చాలా కాలంగా రూమర్ వినిపిస్తూనే ఉంది. అయితే జవాన్ సినిమాతో బాలీవుడ్ చేరిన అట్లీ..పుష్ప సీక్వెల్ తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ కలయిక కు ముహూర్తం మాత్రం కుదరలేదు. అయితే తాజాగా మరోసారి వీకి కాబినేషన్ పై న్యూస్ వైరల్ అవుతుంది.
పుష్ప సక్సెస్, జాతీయ అవార్డ్ సాధించడంతో పాటు.. గ్లోబల్ ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఏది చేసినా.. సైలెంట్ గా ఓపిగ్గా..వెయిట్ చేస్తూ..అనుకున్నది సాధిస్తున్నాడు. ఈక్రమంలో అల్లుఅర్జున్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. అయితే పుష్పతో ఇండియా వైడ్ గా వచ్చిన ఇమేజ్ ను డబుల్ చేసుకోవాలి అని చూస్తున్నాడు బన్నీ. దాని కోసం పుష్ప 2 ను అంతకు మించి అన్నట్టుగా.. జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో ఆయన గ్లోబల్ రేంజ్ లో హైలెట్ అవ్వాలి అని చూస్తున్నాడు. ఈక్రమంలో బన్నీ నెక్ట్స్ కాంబినేషన్స్ పై కూడా గట్టిగా ఫోకస్ చేశాడ.
ఈక్రమంలో వినిపిస్తున్న కాంబినేషన్స్ లో .. అల్లుఅర్జున్, అట్లీ కూడా ఒకటి. అట్లీ జవాన్ సినిమాతో బాలీవుడ్ చేరాడు. షారుఖ్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోను డైరెక్ట్ చేసి.. ఓ రేంజ్ తెచ్చుకున్నాడు. రేపు (సెప్టెంబర్ 7) జవాన్ భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఈసినిమా పఠాన్ ను మించి సక్సెస్ సాధిస్తే మాత్రం.. అట్లీ రేంజ్ మారిపోతుంది. బాలీవుడ్ నుంచి అవకాశాలు వెల్లువలా వచ్చేస్తాయి. ఇప్పటికే అట్లీకి అక్కడ డిమాండ్ బాగా వినిపిస్తుంది. ఈ క్రమంలో అట్లీ మాత్రం టాలీవుడ్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఆయన చూపు బన్నీ మీద పడిందట.
అల్లు అర్జున్ కోసం ఆయన ఓ కథ తయారు చేసుకున్నారట. త్వరలో బన్నీకి ఆ కథ వినిపించాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారట అట్లీ. నిజానికి జవాన్ లోనే బన్నీ నటిస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయ్. కానీ అందులో నిజం లేదని తేలింది. ఇప్పుడు అట్లీ చేయబోయే తర్వాతి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి బన్నీనే హీరో అని సమాచారం. ప్రస్తుతానికి బన్నీ ‘పుష్పా2’తో, అట్లీ ‘జవాన్’ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్ నిజంగా సినిమా ఖరారైతే బన్నీ అభిమానులకు పండగే.