Asianet News TeluguAsianet News Telugu

Allu Arjun-trisha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జోడీగా త్రిష..? సెట్ చేసే పనిలో మాటల మాంత్రికుడు

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సందడి చేయడానికి సన్నాహాలు జరుగుతన్నాయి. ఇంత వరకూ ఏ సినిమాలో  కలిసి నటించని కాంబోలు త్వరలో వెండితెరపై వెలుగబోతున్నాయి.తాజాగా అల్లు అర్జున్ సరసన త్రిష నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఏసినిమాలో తెలుసా..?  
 

Icon Star Allu Arjun Movie With Heroine trisha Trivikram Direction JMS
Author
First Published Nov 25, 2023, 12:57 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకుపోతున్నాడు. ఆస్కార్లు సాధించకుండానేు గ్లోబల్ ఇహేజ్ సాధించాడు పుష్ప సినిమాతో. అంతే కాదు...బెస్ట్ యాక్టర్ గా నేషనల్అవార్డ్ కూడా విన్ అయ్యాడు బన్నీ. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ షూట్ లో మునిగిపోయి ఉన్నాడు బన్నీ. ఆతరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తో ఇప్పటి వరకూ మూడు సినిమాలు చేశాడు ఐకాన్ స్టార్. ఆ మూడు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో పాట్ ట్రెండ్ సెట్టర్స్ గానిలిచాయి. 

ఇక చివరిగా వీరిద్దరికాంబోలో  2020లో ' అల వైకుంఠపురంలో  సినిమా రాగా.. ఈమూవీ సూపర్ సక్సెస్ సాధించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు బన్నీ నటనకు అద్భుతం అంటూ ప్రశంసలు దక్కాయి. ఇక ఈకాంబినేషన్ నాలుగో సారి కలిసి పనిచేయ బోతున్నారు. వీరిద్దరి కాంబోలో  AA22 ' అనే కొత్త ప్రాజెక్ట్‌ చేయబోతున్నారు. అయితే ఇంకా అధికారికంగా అనౌన్స్ మెంట్ రాలేదు కాని..లోపల చేయాల్సి వర్క్ అంతా చేస్తున్నారని టాక్.  అంతే కాదు ఈమూవీ కోసం కాస్ట్ అండ్ క్రూను సెట్ చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. 

విక్రమ్ ధృవ నక్షత్రమ్ నుంచి కమల్ విశ్వరూపం వరకు.. థియేటర్లలో రిలీజ్ కష్టాలు ఎదుర్కొన్న తమిళ సినిమాలు

అంతే కాదు పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ ఇమేజ్ ఏం రేంజ్ లో ఉంటుందో చెప్పడం కష్టం. అందుకే.. బన్నీ గ్లోబల్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను సెట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈక్రమంలో ఈమూవీలో హీరోయిన్ ను సెట్ చేసే పనిలో ఉన్నాడట మాటల మాత్రికుడు. అటు మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా షూటింగ్ చేస్తూనే.. ఇటు బన్నీ సినిమా పనులు చేసుకుంటుననాట త్రివిక్రమ్. అయితే ఈసినిమాలో త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. 

అల్లు అర్జున్ మరియు త్రిష కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకోవడం ఇదే మొదటిసారి కావడంతో బజ్ భారీగా ఉంటుంది. అంతే కాదు వారిద్దరి  ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. AA22 భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఒక పీరియాడిక్ కథతో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. వర్క్ ఫ్రంట్‌లో, ఇటీవల తన పుష్పా ది రైజ్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప ది రూల్ చిత్రానికి సీక్వెల్ కోసం గట్టిగా కష్టపడుతున్నారు.  సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. 

అటు హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన  త్రిష.. చివరిసారిగా లియో చిత్రంలో కనిపించింది మరియు నటి ఇప్పుడు అజిత్‌తో కలిసి విడా ముయార్చి  సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ జరుగుతోంది.. ఆమె మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తోన్న  థగ్ లైఫ్ చిత్రానికి కూడా సైన్  చేసింది. మరిన్ని ప్రాజెక్ట్స్ త్రిష ఖాతాలో ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios