ఈ రోజు రాజమౌళి వదిలే వీడియో కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంటే ఆర్ ఆర్ ఆర్ గురించి ఏదన్న ఆప్ డేట్ ఇవ్వటానికి రాజమౌళి ఏదన్నా వీడీయో అప్ లోడ్ చెయ్యబోతున్నా అని చెప్పారా అంటే అదేమీ కాదు..ఆయన తన ఇంట్లో ఉంటూ భార్యకు,కుటుంబానికి సహకరిస్తూ చేసే ఇంటి పనులకు సంభందించిన వీడియో ట్విట్టర్ లో అప్ లోడ్ చేస్తానని అన్నారు. ఆయన ఆ వీడియో అప్ లోడ్ చేస్తాననటానికి కారణం మరో ప్రముఖ దర్శకుడు సందీప్ వంగా. అసలేం జరిగిందీ అంటే..

‘‘మగవారు ఇంటి ప‌నులను చ‌క్క‌గా చేస్తారు. నిజ‌మైన పురుషుడెవ‌డు ఈ క్వారంటైన్ టైమ్‌లో ప‌నిమ‌నుషులు రాన‌ప్పుడు ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నుల‌ను చేయించడు. బీ ది రియ‌ల్ మేన్‌. నేను రాజ‌మౌళిగారిని ఇలాంటి వీడియో ఒక‌టి అప్ లోడ్ చేసి బీ ది రియ‌ల్ మేన్‌ను విస్తృతం చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అంటూ సందీప్ వంగా నిన్న బీ ది రియల్ మేన్ ఛాలెంజ్ వదిలారు. దాన్ని సగౌరవంగా ఏక్సెప్ట్ చేసారు రాజమౌళి. 

రాజమౌళి ఆ వీడియో ఛాలెంజ్ కు ఓకే చెప్తూ... “ఛాలెంజ్ ఏక్సెప్టెడ్, సందీప! ఇంట్లో ఉన్న వర్క్ లోడ్ ని షేర్ చేసుకోవటం చాలా ముఖ్యం...నేను నా హోమ్ వర్కవుట్ ని రేపు పోస్ట్ చేస్తాను #BetheREALMAN.” అంటూ రిప్లై ఇచ్చారు. ఇది రాజమౌళి అభిమానుల్లో ఆనందాన్ని కలగచేసింది. ఇక ఇప్పుడు రాజమౌళి ఎవరిని ట్యాగ్ చేస్తూ ఈ ఛాలెంజ్ ని ముందుకు తీసుకెళ్తారు..ప్రభాస్ నా లేక ఎన్టీఆర్ నా లేక రామ్ చరణ్ నా ..ఇవేమీ కాకుండా సినీ టెక్నిషియన్స్ నా అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.