Asianet News TeluguAsianet News Telugu

ప్రియా ప్రకాష్ వల్లే సినిమా దొబ్బింది: హీరోయిన్

మలయాళ బ్యూటీ, వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం ‘లవర్స్ డే’. ప్రేమికుల రోజున విడుదలైన ఈ చిత్రం పూర్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ బాగాలేదని టాక్ రావడంతో తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ ను మార్చి వదిలిన సంగతి తెలిసిందే.  బుధ వారం నుండి ఈ చిత్రం   న్యూ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయినా పెద్ద కలిసొచ్చిందేమీ లేదు. సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో   ప్రియాప్రకాష్ వారియర్ పై ఆమె సహనటి నూరిన్ కొన్ని కామెంట్స్ చేసారు. 

I will never work with Priya Prakash
Author
Hyderabad, First Published Feb 23, 2019, 12:24 PM IST

మలయాళ బ్యూటీ, వింక్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన మొదటి చిత్రం ‘లవర్స్ డే’. ప్రేమికుల రోజున విడుదలైన ఈ చిత్రం పూర్ రివ్యూస్ ను రాబట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ బాగాలేదని టాక్ రావడంతో తాజాగా ఈ చిత్ర క్లైమాక్స్ ను మార్చి వదిలిన సంగతి తెలిసిందే.  బుధ వారం నుండి ఈ చిత్రం   న్యూ వెర్షన్ థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయినా పెద్ద కలిసొచ్చిందేమీ లేదు. సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో   ప్రియాప్రకాష్ వారియర్ పై ఆమె సహనటి నూరిన్ కొన్ని కామెంట్స్ చేసారు. 

నూరిన్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సినిమా గురించి సంచలన విషయాలు వెల్లడించింది. నిజానికి ఈ సినిమాలో మొదటట హీరోయిన్ నేను కానీ వింక్ వీడియో తో ఓవర్ నైట్ లో ప్రియా ప్రకాష్ స్టార్ కావడంతో దర్శక,నిర్మాతలు స్క్రిప్ట్ ను మార్చేసారు. ప్రియా ప్రకాష్ కు మెయిన్ హీరోయిన్ రోల్ ఇచ్చారు. దాంతో సినిమా మొత్తం మారిపోయి...ఆడటం లేదు. అలా చేయటంలో  ప్రియా ఒత్తిడి కడా ఉంది. కాబట్టి ఇక మీదట ప్రియా ప్రకాష్ తో కలిసి నటించనని నూరిన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఇక ప్రియా ప్రకాశ్‌ ద్వారా సినిమాకు ఎంతో పాపులారిటీ వచ్చింది కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ వద్ద డీలాపడిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని క్లైమాక్స్‌ భాగం ప్రేక్షకులను నిరాశకు గురిచేసిందని రివ్యూలు వచ్చాయి. దాంతో కేవలం క్లైమాక్స్‌ సన్నివేశాన్ని మార్చాలని దర్శక,నిర్మాతలు  నిర్ణయించారు. 

 డైరక్టర్ మాట్లాడుతూ...‘క్లైమాక్స్‌ సన్నివేశంలో మార్పులు చేసి మళ్లీ చిత్రీకరించాం. పది నిమిషాల పాటు ఈ సన్నివేశం ఉండబోతోంది. బుధవారం నుంచి కొత్త క్లైమాక్స్‌తో సినిమా ప్రదర్శితమవుతుంది. నేను తీసిన మూడో చిత్రమిది. నా మొదటి రెండు సినిమాలు కూడా రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలోనే ఉంటాయి. 

దాంతో ‘ఒరు అడార్‌ లవ్’ సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించాలని అనుకున్నాను. అందుకే క్లైమాక్స్‌కు ట్రాజెడీనీ జోడించాను. కానీ ప్రేక్షకులు ఈ సన్నివేశంతో నిరాశకు గురయ్యారు. దాంతో ఆ సన్నివేశాన్ని మార్చాలని నేను, నిర్మాత నిర్ణయించుకుని కొత్తగా మళ్లీ తెరకెక్కించాం’ అని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios