సినిమా ఇండస్ట్రీలో నటీనటులు నటనంటే ఇష్టమని, ఆనందం కోసం నటిస్తుంటామని చెబుతుంటారు. కానీ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నానని మాత్రం ఎవరూ చెప్పరు. ఒకవేళ తాము నిజంగా డబ్బు కోసమే సినిమాలు చేస్తోన్నా.. బయటకి చెప్పడానికి మాత్రం ఇష్టపడరు.

నటన మీద మక్కువతోనే సినిమాలు చేస్తున్నామని చెబుతారు. బాలీవుడ్ హీరోయిన్ రాధికా ఆప్టే మాత్రం తను డబ్బు కోసమే సినిమాలు చూస్తుంటానని బహిరంగంగా కామెంట్స్ చేసింది. 'మంచు కథలు దొరకాలి. మంచి పాత్రకు రావాలి అనుకుంటూ ఎదురుచూస్తూ ఉండను. నాకు వర్క్ కావాలి అంతే.. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నాను.

నేనొక్కదాన్నే కాదు చాలా మంది డబ్బు కోసమే పని చేస్తుంటారు. బతకడానికి, ఖరీదైన లైఫ్ స్టైల్ కోసం డబ్బు అవసరం ఉంటుంది. అందుకే గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాను. అందరికీ తమ వృత్తి సంతృప్తినిస్తుందని నేను అనుకోను. కేవలం డబ్బు కోసమే పనిచేసేవాళ్లు చాలా మంది ఉన్నారు'' అంటూ చెప్పుకొచ్చింది.