పబ్లిక్ లోనే ఓ వ్యక్తి తన వెనుక భాగాన్ని గిల్లినట్లు చెప్పింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమె నటించిన 'మణికర్ణిక' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు.

ఈ క్రమంలో మీటూపై కొన్ని కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. గతంలో మీటూకి సంబంధించి బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, నిర్మాత వికాస్ బెహెల్ లు తన పట్ల ప్రవర్తించిన తీరుని మీడియా ముందు వెల్లడించిన కంగనా తాజాగా ఆమె ఎదుర్కొన్న మరో సంఘటన గురించి వెల్లడించింది.

''ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు పబ్లిక్లోనే ఓ వ్యక్తి తాకరాని చోట తాకుతూ నన్ను గిల్లాడు. ఇప్పుడు ఏం చేయగలవు అన్నట్లుగా అతడు చూసిన చూపుతో నాకు చిరాకు వచ్చింది'' అంటూ తెలిపింది.

ఆడపిల్లల రక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఓ చర్చా వేదికలో రాణీముఖర్జీ చెప్పారని.. ఆమె చెప్పింది నిజమేనని చెప్పుకొచ్చింది కంగనా. మీటూ ప్రభావం చిత్ర పరిశ్రమలో బాగా ఉందని, నటీనటులతో అసభ్యంగా ప్రవర్తించే వారు ఉంటారని, ఆడపిల్లల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వారి భద్రతకి బాధ్యత వారిదేనని తెలిపింది.