పాపులర్  కామెడీ షో ' జబర్దస్త్' లో తన హాట్ అందాలు ఒలకపోస్తూ దూసుకుపోతున్న అందం రేష్మి.  అప్పుడు సినిమాల్లో సైతం మెరుస్తూ,బోల్డ్ క్యారక్టర్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసే ఈమె సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తూంటుంది. అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతూ...హడావిడి చేస్తూంటుంది. తన మనస్సులో మాటలు చెప్పి అభిమానుల మనస్సులు దోచుకుంటూంటుంది. తాజాగా ఆటో ఇమ్యూన్‌ సమస్యల వల్ల స్టెరాయిడ్స్‌ వాడానని షాకింగ్‌‌ విషయాన్ని చెప్పి షాక్ ఇచ్చింది.

రీసెంట్ గా రష్మి  చెప్పిన మాటలను బట్టి ఆమెకు రుమటాయిడ్‌ ఉందన్న విషయం బయటపడింది. తను ట్రీట్మెంట్ తీసుకున్నానని రష్మి చెప్పటం చాలా మందిని ఆలోచనలో పడేసింది. తాజాగా శిరీష అనే  ఆమె.. రష్మికి ట్విట్టర్ లో ... చేస్తూ..‘రుమటాయిడ్‌ వ్యాధికి ట్రీట్మెంట్  ఉందో లేదో తెలియదు కానీ... నా భర్త నాలుగేళ్లుగా రుమటాయిడ్స్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్  నిమిత్తం ఎక్కడికి వెళ్లాలో తెలీడం లేదు. ఒకప్పుడు మీరూ రుమటాయిడ్‌తో బాధపడిన వారే కదా.. మీరేదన్నా ఐడియా ఇవ్వగలరా?’ అని అడిగింది.

వెంటనే  రష్మి స్పందిస్తూ.. ‘ఈ హెల్త్ ప్లాబ్లం కి ప్రత్యేక ట్రీట్మెంట్  అంటూ లేదు. మన లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవడంతోనే మన జీవితంలో మార్పు కనబడుతుంది. ఆయుర్వేద మందులు వాడి చూడండి. ఇటీవల నాకు ఆటో ఇమ్యూన్‌ సమస్యలు ఎదురైనప్పుడు స్టెరాయిడ్లు తీసుకున్నాను. 

నేను చిన్నప్పుడు అంటే 12 ఏళ్ల వయసులో దాదాపు ఐదేళ్ల పాటు రుమటాయిడ్స్‌ నుంచి విముక్తి పొందడానికి బాగా నొప్పి కలిగించే స్టెరాయిడ్స్(ఇంజక్షన్స్) తీసుకున్నా. ఆ తర్వాత మా అమ్మ చెప్పిన కొన్ని చిట్కాల వల్ల బ్యాలెన్స్‌ చేసుకుంటూ వచ్చాను. నొప్పితో బాధపడటం అనేది జీవితంలో ఓ భాగం మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.  ఆ పెయిన్ కే పరిమితం అయిపోకుండా రోజూ వ్యాయామం, నడక వంటివి చేస్తూ ఉండాలి. ఫ్రెష్ ఫుడ్  తీసుకోవాలి. అంతేకాదు మనకి టెన్షన్  కలిగించి, వెనక్కి లాగాలని ప్రయత్నించే మనష్యులకు దూరంగా ఉండాలి’ అని వెల్లడించారు.

ఇది కూడా చదవండి.. 

ఆ వ్యాధి డిప్రెషన్ కి గురి చేస్తుంది.. యాంకర్ రష్మి షాకింగ్ కామెంట్స్!