సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అక్కడి జనజీవనం స్తంభించిపోయింది. విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.

ఈ క్రమంలో ముంబై ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరాల్సిన రకుల్.. విమానాలు రద్దు కావడంతో అక్కడే చిక్కుకుపోయారు. 'ముంబై ఎయిర్ పోర్ట్ తెరిచి ఉందో లేదో.. ఎవరైనా.. సమాచారం అందిస్తారా..?' అంటూ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్ కి స్పందించిన రకుల్.. 'సోమవారం రాత్రి నుండి ఒక్క విమానం కూడా ఎయిర్ పోర్ట్ నుండి కదల్లేదు.. నేను ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయాను' అని సమాధానమిచ్చింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా అనేక విమానాలను దారి మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. 

ఈ నెల 5వ తారీఖు వరకు ముంబైలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.