స్టార్ హీరో.. నయన్ కు 'ఐ లవ్యూ' చెప్పాడు!

I love you Nayanthara, says Dulquer Salman
Highlights

దక్షినాది స్టార్ హీరోయిన్ నయనతారకు తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్

దక్షినాది స్టార్ హీరోయిన్ నయనతారకు తెలుగు, తమిళ భాషల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇండస్ట్రీలో కూడా ఆమెకు అభిమానులు బాగానే ఉన్నారు. ఆ అభిమానంతోనే ఓ పెళ్లైన స్టార్ హీరో నయనతారకు ఐ లవ్యూ చెప్పేశాడు. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల చెన్నైలో ఓ అవార్డు ఫంక్షన్ జరిగింది.

ఇందులో 'అరమ్' సినిమాకుగాను నయనతార ఉత్తమనటి అవార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్భంలో నయన్ కు సంబంధించిన ఓ చిన్న క్విజ్ ను నిర్వహించారు. ఇందులో భాగంగా నయన్ సినిమాలోని ఫేవరైట్ డైలాగ్ చెప్పమని దుల్కర్ సల్మాన్ ను అడిగారు. దీనిపై స్పందిస్తూ.. అట్లీ డైరెక్ట్ చేసిన 'రాజారాణి' సినిమా అంటే తనకు చాలా ఇష్టమని, ఆ సినిమాలో నయనతారతో హీరో జై చెప్పే డైలాగ్ ను తన వెర్షన్ లో.. 'ఐ లవ్యూ నయనతార నీ నటనను ఎల్లప్పుడూ ప్రేమిస్తూ నీ అభిమానిగానే ఉండిపోతా' అని చెప్పుకొచ్చాడు.  

loader