రకుల్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు బాలీవుడ్ లో ఓ విజయం అందుకుంది. అజయ్ దేవగన్ సరసన నటించిన దే దే ప్యార్ దే చిత్రం మంచి వసూళ్లు రాబడుతుండడంతో రకుల్ హ్యాపీగా ఉంది. ఈ చిత్ర విజయంతో తనకు బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. శుక్రవారం రోజు రకుల్ నటించిన ఎన్.జి.కె చిత్రం విడుదల కాబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో పాల్గొంది. 

ఈ ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ సింగ్ గతంలో ఓ నెటిజన్ ని తీవ్రంగా దూషించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆ మధ్యన రకుల్ ప్రీత్ సింగ్ పొట్టి దుస్తులతో కారులో నుంచి దిగి వస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై ఓ నెటిజన్ దారుణంగా కామెంట్ చేశాడు. కారులో సెషన్స్ కంప్లీట్ చేసి వస్తున్నావా అంటూ ట్రోల్స్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చింది. కారులో సెషన్స్ చేసే అలవాటు మీ తల్లికి ఉందా అని ప్రశ్నించింది. రకుల్ సమాధానం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. 

ఇటీవల మీరు ఓ నెటిజన్ ని ఘాటుగా సమాధానం ఇచ్చి అతడి నోరు మూయించారు. సోషల్ మీడియా ట్రోలింగ్ ని మీరు సీరియస్ గా తీసుకుంటారా అని ప్రశ్నించగా రకుల్ స్పందించింది. కాస్త ఎమోషనల్ గా సమాధానం ఇచ్చింది. నేను నటిగా కెరీర్ ప్రారంభించి ఆరేళ్ళు పూర్తవుతోంది. ఈ ఆరేళ్లలో సోషల్ మీడియాలో ఒక్కరిని కూడా విమర్శించలేదు. నేను స్పందించిన తొలి ట్రోల్ ఇదే. ఎందుకంటే అతడు నా క్యారెక్టర్ పై మచ్చ వేస్తూ కామెంట్స్ చేశాడు. 

అంత దారుణంగా కామెంట్స్ చేసి తప్పుంచుకుని వెళ్ళకూడదు. అందుకే బదులిచ్చా. సోషల్ మీడియాలో ఎలా పడితే అలా వాగకూడదనే విషయం అందరికి తెలియాలనే ఉద్దేశంతో అంత ఘాటుగా బదులిచ్చానని రకుల్ తెలిపింది.