Asianet News TeluguAsianet News Telugu

నా ఎక్స్, నేను, నా బోయ్ ప్రెండ్...కాకుండా పవన్ గురించి...?

తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్‌ లైఫ్ మీద తానే సెటైర్స్ వేసుకున్న మలైక… అప్‌కమింగ్ రియాలిటీ షోలో అన్ని విషయాలు ఓపెన్‌గా మాట్లాడతానంటున్నారు.

I Have Moved On And My Ex... Says Malaika Arora
Author
First Published Dec 5, 2022, 8:55 AM IST


హీరోలు, హీరోయిన్స్ జీవితాల్లోని వివాదాస్పద విషయాలు అంటే జనాలకు ఎప్పుడూ ఆసక్తే. అదే కోవలం హీరోయిన్ గా కాకపోయినా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా , ఐటమ్ గర్ల్ తనేంటో ప్రూవ్ చేసుకున్న మలైకా ఆరోరా ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా తన బోయ్ ప్రెండ్ అర్జున్ కపూర్ తో డేటింగ్ ఎప్పుడూ వివాదాస్పదమే.  ఆమె స్పంయగా తన గురించి చెప్పుకుంటుంది. నేను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను కాదు… మోస్ట్ లవబుల్ స్టార్ అంతకన్నా కాదు.. ఇక యూత్ ఐకాన్ అన్న మాట నాకు అస్సలు సెట్ కాదు… అంటూ తన మీద తానే సెటైర్స్ వేసుకుంటుంది ఈ  బాలీవుడ్ గ్లామర్ దివా మలైకా అరోరా.. 

దాదాపు పాతికేళ్లుగా ఈ గ్లామర్ ప్రపంచంలో ఈదులాడుతున్నా.. బాలీవుడ్‌లో మాత్రం పెద్దగా బిజీ కాలేకపోయింది మలైకా అరోరా. కెరీర్‌ స్టార్టింగ్ నుంచి హీరోయిన్‌ రోల్స్‌ వైపు చూడకుండా ఐటమ్ సాంగ్స్‌, గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ నెమ్మదిగా అవి కూడా తగ్గించేశారు. మరి ఏం చేస్తోంది ఆమె అంటే..బుల్లి తెరలో,ఓటిటిలలో బిజీ అవుతున్నారు. డ్యాన్స్‌ రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా పాల్గొంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. వెండితెర మీద కనిపించకపోయినా… ఏదో ఒక రకంగా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు.  

తాజాగా  తన రాబోయే రియాలిటీ షో మూవింగ్ ఇన్ విత్ మలైకా కోసం సిద్ధమవుతున్న మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ క్లిప్‌లో, మలైకా అర్బాజ్ ఖాన్ నుండి విడిపోవడం మరియు ఫరా ఖాన్‌తో తన జీవితంలో తీసుకున్న డెసిషన్స్  గురించి  మాట్లాడింది . చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది ప్రోమో. తను జీవితంలో తీసుకున్న ప్రతీ డెసిషన్ ఆనందం కలిగించింది అని చెప్తోంది. తను ముందుకు వెళ్లాలని, తన ఎక్స్ కూడా ముందుకు వెళ్లారని, మీరు ఎప్పుడు ముందుకు వెళ్తారన్నట్లు మాట్లాడింది. ఇక ఈ ఎపిసోడ్ బాగా క్లిక్ అవుతుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భావిస్తోంది. ఈ షోలో తన బోయ్ ప్రెండ్ మేటర్ హాట్ టాపిక్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.   అయితే చూడాలి మరి.
 

Follow Us:
Download App:
  • android
  • ios