ప్రేమ విషయంలో మోసపోయా.. రాయ్ లక్ష్మీ కామెంట్స్!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 23, Apr 2019, 10:05 AM IST
I have failed love stories says raai laxmi
Highlights

సౌత్ లో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ ప్రేమలో రెండు, మూడు సార్లు మోసపోయానని చెబుతోంది. 

సౌత్ లో గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ ప్రేమలో రెండు, మూడు సార్లు మోసపోయానని చెబుతోంది. నటిగా సరైన సక్సెస్ లు లేనప్పటికీ తరచూ ఏదొక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈమెకు సంబంధించిన విషయాల్లో పుకార్లు వినిపిస్తూనే ఉంటాయి.

ఇదే విషయంపై ఆమెని ప్రశ్నించగా.. తనపై ఒకటి కాదు, వందల, వేల సంఖ్యలో పుకార్లు వస్తుంటాయని చెప్పింది. తను గర్భవతి అనే ప్రచారం కూడా జరిగిందని, చాలా మందితో సంబంధాలు పెట్టుకున్నానని వార్తలు రాస్తున్నారని చెప్పుకొచ్చింది.

ఏ స్త్రీ అయినా.. ఒకరికన్నా ఎక్కువ మందితో రిలేషన్షిప్ చేయగలదా..? అది సాధ్యమయ్యే పనేనా..? ఇవేవీ ఆలోచించకుండా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు మండిపడింది. 

ప్రేమ విషయంలో రెండు, మూడు సార్లు మోసపోయిన మాట నిజమేనని, ఆ తరువాత తన తప్పు తెలుసుకొని సంబంధాన్ని తెంచుకున్నట్లు, ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం సినిమాల మీదనే అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవల రాయ్ లక్ష్మీ నటించిన 'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

loader