మా ఎఫైర్ గురించి దర్శన్ భార్యకు కూడా తెలుసు... సంచలంగా పవిత్ర గౌడ్ పోస్ట్
కన్నడ పరిశ్రమలో హీరో దర్శన్ వ్యక్తిగత వ్యవహారం రచ్చకెక్కింది. భార్య, ప్రియురాలు సోషల్ మీడియా వేదికగా కొట్టుకుంటున్నారు. శాండల్ వుడ్ లో ఇది హాట్ టాపిక్ అయ్యింది.
కన్నడ పరిశ్రమలో దర్శన్ స్టార్ హీరోల్లో ఒకరు. దర్శన్ కి అక్కడ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన లేటెస్ట్ మూవీ కాటేరా బ్లాక్ బస్టర్ హిట్. ఈ చిత్రం కేవలం కన్నడ భాషలో రూ. 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. కాటేరా సక్సెస్ ని దర్శన్ ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వ్యక్తిగత వివాదాలు ఆయన్ని చుట్టుముట్టాయి. దర్శన్ భార్య విజయలక్ష్మి, ఆయన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ్ మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది.
ఈ వివాదం విజయలక్ష్మి పోస్ట్ తో మొదలైంది. భర్త దర్శన్, కొడుకుతో కూడిన ఫోటో పోస్ట్ చేసిన విజయలక్ష్మి.. 'ఇది మా కుటుంబం. మా వన్ అండ్ ఓన్లీ సన్ తో' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. విజయలక్ష్మి పోస్ట్ కి కౌంటర్ గా పవిత్ర గౌడ్.. 'మా బంధానికి పదేళ్లు. లవ్ ఫర్ ఎవర్..' అంటూ దర్శన్ తో సన్నిహితంగా ఉన్న ఫొటోలతో ఓ వీడియో పోస్ట్ చేసింది. పవిత్ర గౌడ్ చేసిన పనికి విజయలక్ష్మికి చిర్రెత్తుకొచ్చింది.
పవిత్ర గౌడ్ కి కౌంటర్ గా విజయలక్ష్మి సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. పవిత్ర గౌడ్ భర్త సంజయ్ గౌడ్, ఆమె కూతురు ఖుషి గౌడ్ తో కూడిన ఫోటోలు షేర్ చేస్తూ... తన కుటుంబాన్ని సొసైటీలో చెడ్డగా చూపించే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని పోస్ట్ పెట్టింది. విజయలక్ష్మి-పవిత్ర గౌడ్ సోషల్ మీడియా వార్ నేపథ్యంలో దర్శన్ కాటేరా సక్సెస్ మీట్ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకున్నాడు.
విజయలక్ష్మి సోషల్ మీడియా పోస్ట్ నేపథ్యంలో పవిత్ర గౌడ్ ఓపెన్ అయ్యింది. నేను సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం నిజమే. మాకు ఖుషి అనే అమ్మాయి ఉంది. ఖుషి తండ్రి దర్శన్ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. సంజయ్ తో నాకు విడాకులు అయ్యాయి. పదేళ్లుగా దర్శన్ నేను ప్రేమించుకుంటున్నాము. మా బంధం గురించి విజయలక్ష్మికి కూడా తెలుసు. సరైన సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతాను. విజయలక్ష్మి పోస్ట్స్ కారణం కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్న పవిత్ర గౌడ్.. దర్శన్ తో తన బంధం బహిర్గతం చేసింది.
కాగా 2011లో విజయలక్ష్మి భర్త దర్శన్ మీద గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ జైలు పాలయ్యాడు. 14 రోజులు రిమాండ్ చేశాడు. తర్వాత మరలా ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. ఇక 2015లో దర్శన్-పవిత్ర గౌడ్ మధ్య ఎఫైర్ నడుస్తుందంటూ వార్తలు వచ్చాయి. 2017లో ఆమె దర్శన్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో పోస్ట్ చేసింది. దీనిపై ఫ్యాన్స్ మండిపడ్డ నేపథ్యంలో అనంతరం తొలగించింది.