ఆ పని ఎప్పటికీ చేయను: రామ్ చరణ్

i don't hurt people says ram charan
Highlights

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా 'రంగస్థలం' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా 'రంగస్థలం' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాను ఇప్పుడు ఇతర భాషల్లో అనువదించే సన్నాహాలు చేస్తున్నారు. తమిళం, మలయాళం,హిందీతో పాటు భోజ్ పూరిలో కూడా అనువదిస్తున్నారు. హిందీ అనువాదానికి సంబంధించిన ప్రచారం కోసం ముంబై వెళ్ళారు రామ్ చరణ్. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. 

రంగస్థలం సక్సెస్ పై మీ కామెంట్..?
వెలకట్టలేని ఓ అనుభూతి కలుగుతోంది. నాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమకు ఎప్పటికీ వారికి రుణపడి ఉంటాను. 

ఇంత సక్సెస్ అవుతుందని ఊహించారా..?
మొదట ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా సినిమా మొదలుపెట్టాం. ఓ మంచి సినిమాను ఆడియన్స్ కు అందిస్తే చాలని అనుకున్నాం. నిజాయితీగా సినిమా చేశాం. 

ప్రేక్షకులకు మాత్రం సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఆ టెన్షన్ మీపై ఉండేదా.?
ఆడియన్స్ కు మన మీద నమ్మకం ఉన్నప్పుడే సినిమాపై అంచనాలు పెరుగుతుంటాయి. నాపై అంత నమ్మకం పెట్టుకున్న అభిమానులకు ఓ మంచి ట్రీట్ ఇవ్వగలిగాననే ఆనందం మాత్రమే ఉంది.వారి అంచనాలను అందుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. అది నా రెస్పాన్సిబిలిటీ కూడా. 

కెరీర్ లో ఎత్తుపల్లాలు వస్తుంటాయి . వాటి కారణంగా పాపులారిటీ పోతుందేమోననే భయం మీలో ఉంటుందా..?
అవును.. నాకు కూడా ఆ భయం ఉంది. కానీ దాన్ని మనం మార్చలేం. ఎందుకంటే ఇతరుల ఆలోచనలను, భావాలను మనం కంట్రోల్ చేయలేం.  వారిని బాధ పెట్టకుండా ఉండాలనే చూస్తా. అప్పుడే ఆడియన్స్ నన్ను ప్రేమించగలరు. ఇతరులను నొప్పించే పనులు నేను ఎప్పటికీ చేయను. 

హిందీలో డబ్ చేయడం ఎలా అనిపిస్తుంది..?
సౌత్ సినిమాలకు మంచి గుర్తింపు వస్తోంది. సినిమాకు భాషతో సంబంధం లేదు. ఒక ప్రాంతానికి చెందిన సబ్జెక్ట్ ను ఎవరి నేటివిటీకు తగ్గట్లు వారు మార్చుకొని సినిమా తీయొచ్చు. హిందీలో సినిమాను డబ్ చేయడం వలన ఇక్కడ మాకు మార్కెట్ కూడా పెరుగుతుంది. మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ఇది మంచి ఇన్స్పిరేషన్. 
 

loader