దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత 'ఓ బేబీ' సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు సమంతను పొగుడుతూ రివ్యూలు ఇస్తున్నారు.

అవి చూసిన సమంత ఆనందానికి అవధుల్లేవు. మహిళా ప్రాధాన్యంతో ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా  ఇంతగా ఆడరించలేదని, కానీ సమంత వల్ల అది సాధ్యమైందని ఓవెబ్ సైట్ రివ్యూ రాసింది. దీన్ని చూసిన సామ్ రిప్లయ్ ఇచ్చింది. 

'ఈ రివ్యూ చదివి నేను ఏడ్చేసా.. ఇది నేను మరింత కష్టపడి పని చేయడానికి స్ఫూర్తినిచ్చింది' అంటూ బదులిచ్చింది. అలానే మరో మీడియా సంస్థ సమంత అధ్బుతంగా నటించిందని చెప్పగా.. దీనికి సామ్ 'ఓకే.. ఇప్పుడెళ్లి నేను నిద్రపోతా.. ధన్యవాదాలు' అంటూ చెప్పుకొచ్చింది.

నందినీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాగశౌర్య, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.