అల్లు అర్జున్ సర్ స్వాగ్ ని మ్యాచ్ చేయలేను, పుష్ప చేయలేను : షారూఖ్ ఖాన్
ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. ఐటమ్ సాంగ్‌కు స్టెప్పు తో షారూఖ్ అదరగొట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ...
సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం అబుదాబి వేదికగా కన్నుల పండువగా జరగింది. సెప్టెంబర్ 27న మొదలైన ఈ అవార్డుల వేడుక ఆదివారం (సెప్టెంబర్ 29)తో ముగిసింది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఫా అవార్డుల ఈవెంట్ కు బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ హోస్టులుగా వ్యవహరించారు.
ఐఫా ని ఊపేసిన 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా'
వచ్చిన గెస్ట్ లను అలరించేందుకు వేదికపై హుషారైన స్టెప్పులు వేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. పాటకు ఎనర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టారు షారుఖ్, విక్కీ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘దేవర’ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా ఈ సాంగ్‌కు స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విశేషం. వీటికి సంబంధించిన వీడియోలను మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.ఇంక ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ వేడుకలో సంబరాలు చేసుకునేందుకు వీలుకలిగింది. అది షారూఖ్ చేసిన వ్యాఖ్యలతో.
ఉత్తమ నటుడుగా షారూఖ్ ఖాన్
ఈ వేడుకల్లో షారూఖ్ ఖాన్‌కు ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జవాన్ చిత్రానికి గానూ ఆయన ఈ అవార్డ్ దక్కించుకున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగాఈ అవార్డు అందుకున్నారు కింగ్ ఖాన్. తన విట్టీ వన్ లైనర్స్ కు బాగా షారూఖ్ కు పెద్ద పేరు. ఆయన వ్యంగ్యం వేసే సెటైర్స్ కూడా సరదాగా ఉంటాయి. ఈ క్రమంలో స్టేజిపై విక్కీ కౌశల్ కు షారూఖ్ కు మధ్య సరదా సరదా జోక్స్, కొన్ని కామెంట్స్ చోటు చేసుకున్నాయి. ఐఫాలో రెండో రోజు షారూఖ్, విక్కీ కౌశల్ ..ఆడియన్స్ ఓ రేంజి లో అలరించటంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ పై చేసిన కామెంట్ తో .
అల్లు అర్జున్ ప్రస్తావన మరోసారి తెచ్చిన షారూఖ్ ఖాన్
షారూఖ్, విక్కీ కౌశల్ సరదా సంభాషణలో షారూఖ్ వరస ఫ్లాఫ్ ల గురించి ప్రస్తావన తెచ్చారు. అప్పుడు షారూఖ్ తాను వదిలేసిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అన్నాడు. అప్పుడు వెంటనే విక్కీ పుష్పకు ఎందుకు నో చెప్పారు అన్నారు. దానికి షారూఖ్ రిప్లై ఇస్తూ...అల్లు అర్జున్ సర్ స్వాగ్ ని నేను మ్యాచ్ చేయలేను అన్నారు. ఆ మాట అనగానే ఆడియన్స్ నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్.
పుష్ప గురించి షారూఖ్ ట్వీట్
ఇక తనదైన స్వాగ్ తో తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ గా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలెబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి అదిరిపోయే ట్వీట్ చేసాడు.
అల్లు అర్జున్ చూసిన ట్వీట్ చూసి షారూఖ్ ఖాన్
జవాన్ సినిమాను చూసిన అల్లు అర్జున్.. షారుఖ్ ఖాన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించినందుకు టీమ్ అందరిని అభినందించారు. షారుఖ్ మాస్ అవతార్ తో పాటు ఆయన స్వాగ్ చూసి ఫిదా అయ్యినట్లు బన్నీ తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అలాగే విజయ్ సేతుపతి, నయనతార, దీపికా నటనతో పాటు, అనిరుధ్ మ్యూజిక్,డైరెక్టర్ అట్లీ ని కూడా ప్రశంసించారు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది.
మీ నుంచి నేర్చుకున్నా అల్లు అర్జున్ కు షారూఖ్ రిప్లై
అప్పుడు అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి కింగ్ ఖాన్ సూపర్బ్ రిప్లై ఇచ్చారు. బన్నీకి థాంక్స్ చెప్పిన షారుఖ్.. పుష్ప సినిమాని మూడు సార్లు చూశానని చెప్పడం గొప్ప విషయం. “మూడు రోజుల్లో మూడు సార్లు పుష్ప సినిమా చూసిన నేను మీ నుండి ఏదో నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు!” అంటూ షారుఖ్ ట్వీట్ చేయడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఆనందంలో నింపింది. త్వరలోనే వచ్చి వ్యక్తిగతంగా స్వయంగా బన్నీని కలుస్తానని షారుఖ్ చెప్పడం విశేషం.
చిరంజీవికి ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్’ అవార్డు
ఐఫా అవార్డుల ప్రదానోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనను ‘అవుట్ స్టాండింగ్ అఛీవ్‌మెంట్’ అవార్డుతో సత్కరించారు ఐఫా నిర్వాహకులు. అలాగే నందమూరి బాలకృష్ణకు ‘గోల్డెన్ లెగసీ’ అవార్డును ప్రదానం చేశారు. ఇక బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ తమిళంలో ఉత్తమ నటి అవార్డును కైవసం చేసుకుంది. పొన్నియన్ సెల్వన్ 2 మూవీలో ఆమె నటనకు గానూ ఈ అవార్డు దక్కింది. వీరితో పాటు వెంకటేశ్, సమంతతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఐఫా అవార్డుల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.