ప్రముఖ నటి అనుష్క 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ సమయంలో గాయపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

ఇటీవల సినిమాలో ఓ ముఖ్యమన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుష్క కాలికి గాయమైందని.. ఆమె నడవలేని స్థితిలో ఉందని.. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని రకరాలుగా వార్తలు వినిపించాయి.

దీనిపై తాజాగా అనుష్క సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పింది. సియాటిల్ లో సంతోషంగా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నానని.. స్పష్టం చేసింది. ఈ పోస్ట్ తో తనపై వస్తోన్న రూమర్లకు చెక్ పెట్టింది ఈ స్టార్ నటి.

ప్రస్తుతం అనుష్క 'సైలెన్స్' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మాధవన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించనుందని టాక్. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😘😘

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on Jun 26, 2019 at 11:15pm PDT