#LEO సెకండాఫ్ లో ల్యాగ్ నిజమేనన్న లోకేష్,కారణం అదేట

మొదటి రోజు నుంచే లియో సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.  ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. 

I accept the feedback received for second half of #LEO jsp


విక్రమ్ మూవీతో దేశవ్యాప్తంగా తనవైపు తిప్పుకున్న తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇప్పుడు లియో సినిమాతో మరోసారి తన మార్క్ చూపించేందుకు దసరాకు మన ముందుకు వచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇందులో ఇళయదళతి విజయ్ హీరోగా చేయగా.. చాలాకాలం తర్వాత త్రిష హీరోయిన్‌గా చేసింది.  లియో ట్రైలర్ బీభత్సం సృష్టించింది. తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన లియో ట్రైలర్ మిలియన్ల వ్యూస్ తెచ్చుకుని రికార్డ్ సృష్టించింది. దాంతో ఓపినింగ్స్ కూడా అదిరిపోయాయి.   లోకేష్ గత చిత్రం ‘విక్రమ్’ ఇక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ కావడంతో ‘లియో’ కి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి. మొదటి రోజు నుంచే లియో సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది.  ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్ దారుణంగా ఉందని విమర్శలు వచ్చాయి. ఈ విషయమై దర్శకుడు లోకేష్ తాజాగా మాట్లాడారు.

కార్తీ లేటెస్ట్ ఫిల్మ్ జపాన్ ట్రైలర్ లాంచ్ కు వచ్చిన లోకేష్ మాట్లాడుతూ...  #LEO సక్సెస్ మీట్ ప్లానింగ్ లో ఉందని, అక్కడ అన్ని విషయాలు చెప్తాను అన్నారు. అలాగే  తాను థియేటర్ లో  #LEO సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసానని, తాము చాలా ఇష్టపడ్డామని చెప్తున్నారని అన్నారు. సెకండాఫ్ కు మిక్సెడ్ రివ్యూలు వచ్చిన మాట నిజమేనని, కొంత ల్యాగ్ ఉందని తాను ఏక్సెప్ట్ చేస్తున్నట్లు చెప్తున్నారు.  ఇక ఈ సినిమా స్క్రిప్టు ఐదేళ్ల క్రితం రాసానని, నేను కొత్త ఎగస్ట్రా ఎలిమెంట్స్ ఏమీ కలపలేదని అన్నారు. 

లియో విషయమై విజయ్ చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు. ఆయన తనకు థియేటర్ విజిట్ సమయంలో గాయాలు అయితే ఫోన్ చేసి అంతా బాగే కదా అని పలకరించరాన్నారు. రెండు రోజుల్లో తాను ఈ సినిమా గురించి పోస్ట్ రిలీజ్ ఇంటర్వూ ఇవ్వబోతున్నట్లు , థీరీలు అన్నటికీ సమాధానం ఇస్తాను అన్నారు.ఇక  #Kaithi2 చిత్రం మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.

లోకేష్ 2017 సంవత్సరంలో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. కేవలం ఆరేళ్లలో అతను టాప్ డైరెక్టర్ల లిస్టులో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తలపతి విజయ్, విజయ్ సేతుపతి, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్‌లతో కలిసి పనిచేశాడు. హైపర్‌లింక్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే, ఖైధీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. లియో సినిమాలో విజయ్, త్రిషతోపాటు గౌతమ్ మీనన్, మిష్కిన్, అర్జున్ సర్జా, సంజయ్ దత్, మన్సూర్ అలీఖాన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. ఇక లియో సినిమా అక్టోబర్ 19న విడుదల అయ్యింది.
  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios