భారీ అంచనాల మధ్య రిలీజైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంపై జబర్దస్త్ ఫేం హైపర్ ఆది ఆసక్తికరమైన రివ్యూను అందించారు. కత్తి మహేష్‌ రివ్యూకు కౌంటర్ ఇస్తూ సినిమా గురించి తన విశ్లేషణను అందించారు. కత్తి మహేష్‌తో సహా సినీ క్రిటిక్స్ అంతా ఓ వైపు సినిమాను ఏకిపారేస్తుంటే హైపర్ ఆది మాత్రం అండగా నిలిచారు. ముఖ్యంగా కత్తి మహేష్ రివ్యూనుద్దేశించి ఆది చాలా ఆసక్తికరమైన కౌంటర్ రివ్యూ ఇచ్చాడు.

అఝాతవాసి సినిమాపై  క్రిటిక్ కత్తి మహేష్ స్పందిస్తూ... అజ్ఞాతవాసి లాంటి సీరియస్ కథకు కామెడీ ట్రీట్మెంట్ వేస్తే సినిమా అపహాస్యం అవుతుంది. కథకు తగ్గట్టుగా చేయాల్సింది చేయక పోగా దాన్ని నాశనం చేస్తే ఎవరూ అప్రిషియేట్ చేయరు. అజ్ఞాతవాసి సినిమా విషయంలో అదే జరిగింది అని మహేష్ కత్తి తన రివ్యూ ఇచ్చాడు

ఈ నేపథ్యంలో హైపర్ ఆది తన రివ్యూను వీడియో రూపంలో రికార్డు చేసి.. “అజ్ఞాతవాసి సినిమా ఇప్పుడే చూసొచ్చాను. సినిమా మాత్రం చాలా చాలా బాగుందిది. తమ్ముడు, తొలి ప్రేమ సినిమాలోని పవన్ కల్యాణ్ కామెడీ టైమింగ్, ఈజ్ మళ్లీ అజ్ఞాతవాసిలో చూడొచ్చు. పవన్ కల్యాణ్ కోసం 10 సార్లు చూడవచ్చు. త్రివిక్రమ్ కోసం మూడు సార్లు చూడొచ్చు. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, మురళీశర్మ కోసం వీలున్నప్పుడల్లా చూడొచ్చు అంటూ ఫేస్ బుక్ లో విడియో పోస్ట్ చేశాడు.

అంతే కాక అజ్ఞాతవాసి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్‌బస్టర్ అని చెప్పారు. ఈ చిత్రంలో.. “బొమన్ ఇరానీ చెప్పిన రాజ్యం మీద ఆశలేని వాడికంటే గొప్ప రాజు ఎవరు ఉంటారు అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది. బొమన్ ఇరానీ చెప్పిన డైలాగ్ పవన్ కల్యాణ్‌కు చక్కగా సరిపోయే డైలాగ్. కేవలం సినిమా కాదు.. పవన్ నిజజీవితానికి సంబంధించిన వరకు ఇది యాప్ట్ అవుతుంది. ఇలాంటి డైలాగ్స్ అజ్ఞాతవాసిలో చాలా ఉంటాయి. సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయండి అని హైపర్ ఆది అన్నారు.

కొత్త సినిమా ప్రేక్షకుడిని చేరేలోపే పురిట్లోనే చంపేస్తున్న రివ్యూలపై పోరాటం చేయడానికి హీరోలు, అభిమానులు, సినీప్రియులు సహకారం అందించాలని కోరుతున్నాను. దయచేసి ఎవరినీ బూతులు తిట్టకండి. ఇది ఏ ఒక్కరిపైనో వ్యక్తిగత పోరాటం కాదు అని హైపర్ ఆది ట్వీట్ చేశారు.

ఒక అమ్మాయిని అందంగా లేవు అని చెప్పు. చెప్పుతో కొడుతుంది. ఎవరి అందం వారిది. సినిమాలుకూడా అంతే. నచ్చేవాళ్లకు నచ్చుతుంది. కాకపోతే చెప్పుతో కొట్టే వాళ్లేలేరు అని హైపర్ ఆది మరో ట్వీట్ కూడా చేశాడు ఆది. ఆది రివ్యూ ఈ క్రింద వీడియోలో చూడండి.