జబర్దస్త్ కామెడీ షోకి సరికొత్త అర్ధాన్ని చెప్పిన హైపర్ ఆది రీ ఎంట్రీ ఇచ్చాడు. గత కొంత కాలంగా ఈ కామెడీ షోకి గ్యాప్ ఇచ్చిన ఆది ఎందుకు మానేశాడు అని అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఫైనల్ గా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చినప్పటికీ పలు ఊహాగానాలు కొత్త అనుమానాలకు ధరి తీశాయి. 

జనసేన ప్రచారం కోసమని అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ప్రెజర్ వల్ల అక్కడి నుంచి ఆదిని తప్పించినట్లు అనేక రకాల కథనాలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే అవేవి కరెక్ట్ కాదని మొత్తానికి రీ ఎంట్రీ ప్రోమోతో ఆది కాంట్రవర్సీలకు కౌంటర్ ఇచ్చాడు. బిజీ బిజీ షేడెల్స్ వల్ల అలసిపోయిన ఆది జస్ట్ బ్రేక్ తీసుకున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.  

తెలుగు బుల్లితెరలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన జబర్దస్త్ గత కొన్నేళ్లుగా టాప్ కామెడీ షోగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. వివాదాలెన్ని వచ్చినా ఫన్ కోరుకునే ఆడియెన్ నాడి పట్టిన ఈ షో ఏ మాత్రం తగ్గట్లేదు. హైపర్ ఆది రాకతో జబర్దస్త్ బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది.