చాలా సరదాగా,కూల్ గా ఉండే హైపర్ ఆది..ముఖంలో కోపం కనపడుతోంది. ఆయన ఓ ఇష్యూపై పోలీస్ స్టేషన్ కు వెళ్తానని,సైబర్ క్రైమ్ వాళ్లని కలుస్తానని అంటున్నారు. హైపర్ ఆది కు అంత కోపం రావటానికి గల కారణం ఏమిటి...అసలేం జరిగింది అనేగా మీ సందేహం...ఆది కోపానికి గల కారణం ఆయన మాటల్లోనే చూద్దాం.
 
హైపర్ ఆది మాట్లాడుతూ....“రీసెంట్ గా ట్విట్టర్, ఇనస్టాగ్రామ్,ఫేస్ బుక్ లో నా పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది .. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు.. నేను ప్రభుత్వాన్ని, ప్రజాభిప్రాయాల్ని గౌరవించే వాడిని. ఎవరో పనికట్టుకొని నా పేరు మీద క్రియేట్ చేసిన ఈ అసత్య ప్రచారాలపై త్వరలోనే సైబర్ క్రైమ్ వాళ్ళని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది..” అన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన హైపర్ ఆది...తమ పార్టీ జనసేన పార్టీ వారితో క్లోజ్ గా వర్క్ చేస్తూంటాడు. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని..  హైపర్ ఆది పేరు పెడితూ.. కొన్ని పోస్టులు తయారుచేసి, దాన్ని జనసేన పార్టీ వాయిస్ గా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇలా జనాల్లోకి వెళ్తున్న వాటిలో ఏపీ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిపై హైపర్ ఆది ఇలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.