తనదైన కామెడీ టైమింగ్‌, పంచ్‌లతో ‘జబర్దస్త్‌’ షోలో ఎడతెగని నవ్వులు పంచి ఎంతో క్రేజ్‌ సొంత చేసుకున్న నటుడు ‘హైపర్‌’ ఆది. ఇక యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్షిణి. వీరిద్దరూ కలిసి ‘జబర్దస్త్‌’ కార్యక్రమంలో ఎన్నో సరదా  పంచ్ లు వేసుకుంటారు.అయితే అవి సరదాగా ఉన్నంతసేపూ ఏ సమస్యాలేదు..కామెడీ కాస్తా ఎదుటివారిని భాదించేలా తయారైతేనే సమస్య. అలాంటి సంఘటనే రీసెంట్ గా జబర్దస్త్ షోలో చోటు చేసుకుంది. 

తాజాగా హైపర్‌ ఆది మరోసారి తన డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో యాంకర్‌పై రెచ్చిపోవటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఓ షోలో పాల్గొన్న హైపర్‌ ఆది..యాంకర్‌ వర్షపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి.  షోలో భాగంగా హైపర్‌ ఆది-వర్షకు మధ్య జరిగిన ఓ డిస్కషన్‌లో ఎలా ఉన్నావు అని ఆది అడగ్గా...బావున్నానండీ. ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి అని వర్ష చెప్పింది.

 దీనికి  కౌంటర్‌గా... 'అదే పనిగా నీకు వచ్చే కామెంట్లు చూసుకుపోయావా..షోలో  కొత్తగా వచ్చిన లేడీ గెటప్‌ ఎవరు అని చాలామంది అడుగుతున్నారు' అంటూ వర్షపై బాడీషేమింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఆమె జెండర్‌పై ఆది చేసిన ఈ వల్గర్‌ కామెంట్స్‌  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. లేడీ యాంకర్ల పరువు తీసేలా ఆది బిహేవ్‌ చేస్తున్నాడంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.  

మరో ప్రక్క జబర్దస్త్ యాంకర్ అనసూయ తన పక్కన ఉంటే హైపర్ ఆది చెలరేగిపోతుంటాడు. పంచ్‌లు ప్రవాహం మొదలవుతుంది. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో అనసూయను ఓ ఆట ఆడుకుంటాడు హైపర్ ఆది. ఇక అనసూయ కూడా తానేం తక్కువ కాదు అన్నట్టుగా హైపర్ ఆదికి కావాల్సినంత హైప్ ఇస్తుంటుంది. అది కూడా శృతిమించనంత సేపూ బాగానే ఉంటుంది. 

‘నానమ్మ తాతయ్య ఖాళీగా ఉన్నారట.. ఓ మనవడ్ని ఇస్తే ఆడుకుంటామని అంటున్నారు’ అంటూ హైపర్ ఆదితో అనసూయ అనగా.. ఆమె భర్తగా యాక్ట్‌గా చేసిన హైపర్ ఆది.. ‘వాళ్లు ఖాళీగా ఉంటే వాళ్లనే ఓ కొడుకుని కనమను.. మనకి అంత సీన్ లేదని చెప్పండి’ అంటూ ముఖం పక్కకు పెట్టుకుని పంచ్ వేశాడు తెగ సిగ్గుపడిపోతూ. అవును అనసూయా.. రీసెంట్‌గా నువ్ ఓ పాట చేశావ్ కదా.. పైన పటారం లోన లొటారం అని కొంపతీసి అది నాకోసం చేశావా? అని ఆది అడగ్గా.. అయ్యో ఎంత మాట.. ఎంత మాట అంటూ లెంపలు వేసుకుంటూ తెగ నటించేసింది అనసూయ.

ఇక అనసూయా.. నన్ను చూడు.. నన్ను చూడు.. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? అని అనసూయను ఆది అడగ్గా.. మీరు ఎప్పటికీ ముసలోడు కాకూడదు అని అనసూయ తెగ సిగ్గుపడిపోతూ.. మెలికలు తిరిగింది. నువ్ మాత్రం ముసలిదానివి అయిపోవచ్చు.. నను మాత్రం అవ్వకూడదా? అంటూ ఆది దిమ్మతిరిగే పంచ్ వేయడంతో నన్ను అంత మాట అంటావా అంటూ అతన్ని బాదేసింది అనసూయ.