బిగ్‌బాస్‌ హైజ్‌లో మొన్నటి వరకు పులిహోర కలిపేది ఎక్కువగా అభిజిత్‌, లాస్య, అఖిల్‌ పేర్లు వినిపించాయి. కానీ హైపర్‌ ఆది షాక్‌ ఇచ్చాడు. తన జబర్దస్త్ మేట్‌ అయిన అవినాష్‌ పై భారీ పంచ్‌ వేశాడు. 

కనిపించవుగానీ, హౌజ్‌లో కిచెన్‌లో ఎక్కువగా పులిహోర కలిపేది అవినాషే అని చెప్పేశాడు. దీంతో అవినాష్‌ షాక్‌కి గురయ్యాడు. ఇలా వరుసగా ఒక్కొక్కరిపై పంచ్‌ల వర్షం కురిపించాడు. హైపర్‌ ఆది డిటెక్టివ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంటిసభ్యుల గురించి చెప్పాలని హోస్ట్ సమంత చెప్పడంతో ఒక్కొక్కరి గురించి చెప్పారు. 

సోహైల్‌ గురించి చెబుతూ, వచ్చిన కొత్తలో `అర్జున్‌రెడ్డి`లాగా ఉండేవాడివనీ, ఇప్పుడు `స్వాతిముత్యం`లా మారిపోయావ`న్నారు. కోపాన్ని కంట్రోల్‌ చేసుకున్నావు కాబట్టి టీవీలో ఉన్నవాని, లేదంటే ఇంట్లో టీవీ ముందు ఉండేవాడని పంచ్‌ వేశాడు. మెహబూబ్‌ గురించి చెబుతూ, కొంటె రాక్షసుల గేమ్‌లో అవినాష్‌లో కొంటె తప్ప రాక్షసుడు లేడని, మెహబూబ్‌లో రాక్షసుడు తప్ప కొంటె లేడని చెప్పేశాడు. 

ఇక అమ్మ రాజశేఖర్‌పై కూడా పెద్ద పంచ్‌ పేల్చాడు. అమ్మా.. దివికి బాగా కనెక్ట్ అయ్యిందని తెలిపాడు. దివి కనెక్షన్‌లో పడి రోబోల ఆటలో అవినాష్‌ ఛార్జింగ్‌ పెట్టుకున్న విషయం కూడా చూసుకోలేదని పంచ్‌ వేశాడు. ఇక అఖిల్‌ గురించి చెబుతూ, అఖిల్‌కి, మోనాల్‌కి మధ్య సింగ్‌ బాగా కుదిరిందని చెప్పాడు. ఒకరు ఉంటే మరొకరుంటారని, వేర్వేరుగా వెతకాల్సిన పనిలేదన్నారు. మోనాల్‌ తనని మొదట కలిసినప్పుడు కిడ్నాపర్‌లా చూసిందన్నారు. 

`బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌` సినిమా షూటింగ్‌లో క్లైమాక్స్ `నా పెళ్ళికి రండి` అని మోనాల్‌ చెప్పిందని, అప్పుడు అభిజిత్‌ `నా కాదు, మా పెళ్ళి అని చెప్పాల`ని చెప్పాడు. కానీ అప్పుడు మోనాల్‌ కరెక్టే చెప్పారు. ఆమె లిస్ట్ లో మీరెవరూ లేరని మరోక్షంగా చెప్పిందని పంచ్‌ వేశాడు. దీంతో అఖిల్‌ మొఖం వాడిపోయినంత పని అయ్యింది.