జబర్దస్త్ రోహిణితో ఎస్ జె సూర్య 'ఖుషి' రొమాన్స్..హైపర్ ఆదికి కనెక్ట్ అయిన మార్క్ ఆంటోని సిల్క్ స్మిత
పండుగ వస్తుందంటే జబర్దస్త్, బుల్లితెర నటీనటులు సరికొత్త షోలతో సందడి చేసేందుకు రెడీ అవుతుంటారు. దసరాకి వీరంతా సందడి చేయబోతున్న షో ధూమ్ ధామ్ దసరా. ఈ షోకి సంబందించిన ప్రోమో తాజాగా విడుదలయింది.
పండుగ వస్తుందంటే జబర్దస్త్, బుల్లితెర నటీనటులు సరికొత్త షోలతో సందడి చేసేందుకు రెడీ అవుతుంటారు. దసరాకి వీరంతా సందడి చేయబోతున్న షో ధూమ్ ధామ్ దసరా. ఈ షోకి సంబందించిన ప్రోమో తాజాగా విడుదలయింది. నవ్వులు పూయించే విధంగా జబర్దస్త్, బుల్లితెర నటీనటులు, కమెడియన్లు, అతిథులు సందడి చేస్తున్నారు.
హైపర్ ఆది, బులెట్ భాస్కర్, రోహిణి, ఆటో రాంప్రసాద్, యాంకర్ రవి , బిగ్ బాస్ సిరి, ఇతర కమెడియన్లు పాల్గొంటున్న ఈ షో ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య అలాగే లలిత జ్యువెలరీ చైర్మన్ కిరణ్ కుమార్ కూడా అతిథులుగా హాజరయ్యారు.
ఈ షోలో మరో సర్ప్రైజింగ్ గెస్ట్ కూడా వచ్చారు. అచ్చం సిల్క్ స్మిత లాగే ఉండే నటి విష్ణుప్రియ గాంధీ కూడా ఎంట్రీ ఇచ్చి సందడి చేసింది. ముఖ్యంగా ఎస్ జె సూర్య, రోహిణితో కలసి చేసిన ఖుషి నడుము సీన్ పేరడీ బాగా నవ్వించేటట్లు ఉంది. రోహిణి నువ్వు నా నడుము చూసావ్ అని అంటే.. అవును చూసాను అయితే ఏంటి అని ఎస్ జె సూర్య అంటున్నారు.
ఇక సిల్క్ స్మిత లాగా ఉండే విష్ణుప్రియ గాంధీ ఎంట్రీ ఇచ్చి నవ్వులని మరో స్థాయికి తీసుకువెళ్ళింది. హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ఆమె చూట్టూ తిరుగుతూ మైమరచిపోతున్నారు. సిల్క్ ఇప్పుడు ఒక చీటీ తీసి అందులో ఉన్న పేరుని చెబుతుంది అని యాంకర్ రవి అంటాడు. తమ పేరు వస్తుందేమో అని ఆత్రంగా హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ ముందుకు వస్తారు.
ఆటో రాంప్రసాద్ పేరునివిష్ణుప్రియ గాంధీ పిలిచింది. దీనితో సరిగ్గా చదవండి అది నా పేరు అయిఉంటుంది అని హైపర్ ఆది ఆత్రంగా చెబుతాడు. ఎవరి పేరు వస్తే వాళ్ళకి సిల్క్ రాఖీ కడుతుంది అని చెప్పడంతో ఇద్దరూ పరిగెత్తుకుని వెళ్లి దాక్కోవడం ఫన్నీగా ఉంటుంది.
విష్ణుప్రియ గాంధీ ఆటో రాంప్రసాద్ అని అన్నయ్య అని పిలవడం, హైపర్ ఆది సంబరాలు చేసుకోవడం ఫన్నీగా ఉంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఆది బావగారు అంటూ హైపర్ ఆదిని విష్ణుప్రియ గాంధీ పిలవడంతో అతడు గాల్లో తేలిపోతాడు. మొత్తంగా ధూమ్ ధామ్ దసరా ఈవెంట్ ఆకట్టుకునేలా ఉంది.