జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంచి మనిషి మాత్రమే కాదని, మొండి వ్యక్తిత్వం గల మనిషిగా ఆయన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని అంటున్నాడు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది. సందర్భం దొరికినప్పుడల్లా.. పవన్ మీద తన అభిమానాన్ని వ్యక్తపరిచే హైపర్ ఆది తాజాగా పాలకొల్లులో జరిగిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ని అందరూ సపోర్ట్ చేసి అధికారంలోకి వచ్చేలా చేయాలని కోరారు. 2009లో 
రాజకీయాల్లోకి వచ్చిన మంచి వ్యక్తిని అందరూ ముంచేశారని.. 2019లోవస్తున్న వ్యక్తి మంచితనంతో పాటు మొండితనం కలిగినవాడని, తాడోపేడో తేల్చుకుంటాడని అన్నారు.

ఎలెక్షన్స్ అయినా.. కలెక్షన్స్ అయినా పవన్ కి రికార్డులు బద్దలు కొట్టడమే తెలుసని తన స్టైల్ లో చెప్పుకొచ్చాడు. సినీ రంగంలో ఉన్నవారు రాజకీయాల్లో ఒకరి వైపే ఉంటే అవకాశాలు రావని అంటుంటారని, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నందుకు తనకు అవకాశాలు రాకపోతే మానేసి ఉద్యోగం చేసుకుంటానని అన్నారు.

కులమతాలకు అతీతంగా పవన్ ని సమర్ధించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.  
 

ఇవి కూడా చదవండి.. 

'జబర్దస్త్' చేయకపోవడానికి కారణమదే.. హైపర్ ఆది కామెంట్స్!

ఇక 'జబర్దస్త్'లో అనసూయ కనిపించదా..?

హైపర్ ఆది రూ.2కోట్ల విలువైన పొలం కొన్నాడట!

'జబర్దస్త్' నుండి హైపర్ ఆది ఔట్..?