గ్లామర్ ఫీల్డ్ లో కాంపిటిషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి కొత్త నీరు రావడం జరుగుతూనే ఉంటుంది. అయితే క్రేజ్ ఉన్న తారలు మాత్రం తమకి రీప్లేస్మెంట్ రాకుండా జాగ్రత్త పడుతుంటారు.

నటి అనసూయ 'జబర్దస్త్' షోతో ఎంతగా పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోతోనే ఆమెకు సినిమాలలోఅవకాశాలు కూడా వచ్చాయి. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఆమె ఈ షోని మాత్రం విడిచిపెట్టదు.

మధ్యలో రష్మి ఆమె స్థానాన్ని కొట్టేయడానికి వచ్చినా.. ఇద్దరూ జబర్దస్త్, ఎక్ట్రా జబర్దస్త్ అంటూ షోని పంచుకున్నారు. ఇప్పుడు అనసూయకి ఎర్త్ పెట్టడానికి వచ్చింది యాంకర్ వర్షిని. కొన్ని కారణాల వలన అనసూయ జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేయలేకపోతేఆమెకి బదులు వర్షిని వచ్చి షోని హోస్ట్ చేసింది.

టెంపరరీగా షోలోకి అడుగుపెట్టిన వర్షినికి అభిమానుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. జబర్దస్త్ కి కొత్త కల వచ్చిందని, అనసూయని తప్పించి వర్షినిని యాంకర్ చేయాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

దీంతో మేనేజ్మెంట్ కూడా వర్షినిని తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే గనుక జరిగితే ఇక జబర్దస్త్ లో అనసూయ కనిపించే ఛాన్సే ఉండదు.