బుల్లితెర 'జబర్దస్త్' షోలో హైపర్ ఆది తనదైన పంచ్ లతో, కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంటాడు. 'జబర్దస్త్' షోలో హైపర్ ఆది స్కిట్ లు ఎంత ఫేమస్ అంటే ఆయన స్కిట్ ల కోసం మాత్రమే షోని చూసేవారు చాలా మంది ఉన్నారు.

అలాంటిది కొద్దిరోజులుగా ఆయన షోలో కనిపించడం లేదు. దీంతో హైపర్ ఆదిపై రకరకాల వార్తలు వినిపించాయి. అసలు ఎందుకు షోకి దూరమవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని హైపర్ ఆది స్వయంగా వెల్లడించాడు. సినిమాల్లో బిజీగా ఉండడంతో షోకి దూరమవ్వాల్సి వచ్చిందట.

అఖిల్ నటిస్తోన్న 'మిస్టర్ మజ్ను' సినిమాకి ముప్పై రోజులు కాల్షీట్స్ కేటాయించడం అలానే మానసిక ఒత్తిడి పెరగడంతో కొంతకాలం పాటు 'జబర్దస్త్' షోలో కనిపించలేదని అన్నారు. వచ్చే ఏడాది జనవరి తరువాత నుండి 'జబర్దస్త్' లో మళ్లీ కనిపిస్తానని వెల్లడించాడు.

ఇది ఇలా ఉండగా.. జనసేన పార్టీలో చేరుతున్నారా..? అనే ప్రశ్నకి సమాధానంగా తనకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అభిమానమని, ఓ వ్యక్తిగా ఆయన్ని సపోర్ట్ చేస్తానని, జనసేన పార్టీలో చేరే ఆలోచన మాత్రం లేదని అన్నారు.