నాకు అక్కడే 5 లక్షల వచ్చేది... అన్నీ వదులుకుని వచ్చా : హైపర్ ఆది

First Published 16, Apr 2018, 6:14 PM IST
Hyper Aadi about his personal life
Highlights

నాకు అక్కడే 5 లక్షల వచ్చేది... 

హైపర్ ఆది జబర్ధస్త్ తో మంచి ఫాలోయింగ్ ఉన్న టీం.  జబర్ధస్త్ తో అతని కెరీర్ పీక్స్ కు వెళ్లింది. ఈ మధ్య తనకు సినిమాలలో కూడా మంచి అవకాశాలు వస్తన్నాయి. తాజాగా హైప‌ర్ ఆది ఇచ్చిన ఒక ఇంట‌ర్వ్యూలో త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి చెప్పుకొచ్చాడు. తాను ప్ర‌కాశం జిల్లాలోని చీమ‌కుర్తి అనే గ్రామంలో జ‌న్మించాన‌ని, త‌మ‌ది వ్య‌వ‌సాయ కుటుంబ‌మ‌ని తెలిపాడు. తను ఇంజ‌నీరింగ్ కంప్లీట చేశాక టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం వ‌చ్చింద‌ని.ఆ టైమ్ లో త‌న జీతం 5 ల‌క్ష‌ల‌ని, కానీ సాఫ్ట్ వేర్ జాబ్ లో ఏదో వెలితిగా ఉండ‌టంతో దానికి రిజైన్ చేసి, జ‌బ‌ర్ధ‌స్త్ లో అవ‌కాశం కొట్టేసాన‌ని చెప్పాడు.

5 ల‌క్ష‌ల జీతం తీసుకున్న‌ప్ప‌టికీ, త‌న‌కు అంత సంతృప్తినిచ్చేది కాద‌ని, కానీ జ‌బ‌ర్ధ‌స్త్ లోకి వ‌చ్చాక‌, త‌న టాలెంట్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురియ‌డంతో చాలా ఆనందం వేసింద‌ని,దాంతో తాను ఇండ‌స్ట్రీలో లీన‌మై పోవాల‌ని అనుకున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశాడు హైప‌ర్ ఆది. 2016 లో జ‌బ‌ర్ధ‌స్త్ షో కు ఎంట్రీ ఇచ్చాన‌ని, త‌న‌కు హైప‌ర్ అనే ప‌దాన్ని త‌న పేరు ముందు పెట్ట‌డం ఎంతో సంతోషాన్నిచ్చింద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు ఆది.

loader