ఐఐటీ డిగ్రీ పట్టా నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్ వరకు.. హైదరాబాదీ తేజశ్రీ ఆసక్తికర ప్రయాణం
మన హైదరాబాద్‌కు చెందిన తేజశ్రీ సిక్కెం కెరీర్ అనూహ్యంగా సాగుతున్నది. ఆమె ఐఐటీ గ్రాడ్యుయేట్ చేసి ఊహించిన రీతిలో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా లక్షలాది మందికి చేరువైంది. వృత్తిపరంగా అందరికి భిన్నంగా ఒక సాంప్రదాయ చట్రం నుంచి దూరంగా ప్రయాణం చేస్తున్నది.
Tejasree Sikkem: తేజుగా పిలుచుకునే తేజశ్రీ సిక్కెం కెరీర్ అనూహ్య మార్గాల్లో సాగుతున్నది. ఆమె కెరీర్ సాంప్రదాయరూపంలో కాకుండా.. ఒక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో డిగ్రీ పట్టా పొంది.. ఆ తర్వాత ఇన్‌ఫ్లుయెన్సర్‌గా రాణించింది. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.
హైదరాబాద్‌కు చెందిన తేజశ్రీ సిక్కెం ఐఐటీలో డిగ్రీ పూర్తి చేసింది. ఐఐటీటీఎం గ్వాలియర్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆము డిజిటల్ వేదికలపై జోష్ టాక్స్ ద్వారా ఫేమ్ సంపాదించింది. ప్రస్తుతం ఓ జర్మన్ బ్రాండ్‌కు పని చేస్తున్నది. ఆమె కెరీర్ సాంప్రదాయ చట్రానికి దూరంగా డిజైన్ చేసుకుని ముందుకు సాగుతున్నది.
ఆమె తన ప్రొఫెషనల్ కెరీరర్‌తోపాటు కళారంగంలోనూ రాణిస్తున్నది. ఒక వక్తగా, మేకప్ ఆర్టిస్ట్‌గా ఆమె తన సృజనాత్మకతకు పదునుపెడుతున్నది. ప్రయాణం, డ్యాన్స్, మ్యూజిక్ పై మక్కువతో అందులోనూ ఆమె తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నది.
రెండేళ్ల క్రితం ఆమె జోష్ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడంతో ఆమె సోషల్ మీడియా ప్రపంచంలోకి దూకింది. సుమారు ఒక వేయి వీడియోలు చేసి.. అభిమాన బంధుగణాన్ని తయారు చేసుకుంది.
Also Read: BRS: మెదక్‌లో ఓడిస్తే బీఆర్ఎస్‌కు చావుదెబ్బే! సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ ఇదేనా?
వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత లక్ష్యాలను సంతులనం చేస్తూ ఆమె తన ప్యాషన్‌ను కూడా చేశారు. ఆమె కమిట్‌మెంట్‌తో బెస్ట్ సౌత్ ఇన్‌ఫ్లుయెన్సర్, బ్లాగర్ వంటి అవార్డులను పొందింది.
తేజు తన కెరీర్‌లో ముందుకు సాగుతూనే కొత్త కంటెంట్ క్రియేటర్లకు విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటుంది. మీ కంటెంట్‌ను నమ్ముకోండి, మీదైన ప్రత్యేకతను ఒడిసిపట్టుకోండి. మీరెంటో వెల్లడించడానికి తడబడొద్దు, వంటి విలువైన అడ్వైజ్‌లు ఇస్తుంది.