Asianet News TeluguAsianet News Telugu

Pushpa: పోలీస్ లు 'పుష్ప' వెనక పడ్డారేంటి,తగ్గేదేలే

ట్రెండింగ్‌లో ఉన్న సినిమాను.. అందులో అంశాన్ని ఉప‌యోగించుకుని ప్ర‌జ‌ల‌కు మెసేజ్ ఇచ్చేలా చేసిన సైబ‌రాబాద్ పోలీసుల క్రియేటివిటీకి నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. పుష్ప ది రైజ్ సినిమా అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందింది.

Hyderabad Traffic Police shares Pushpa poster on social media
Author
Hyderabad, First Published Jan 18, 2022, 8:59 AM IST

గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా పుష్ప కబుర్లే. పుష్ప గెటప్,లుక్, పాటలు, డైలాగులు జనాల్లోకి వెళ్లిపోయాయి. నార్త్ లేదు సౌత్ లేదు అన్నట్లుగా పుష్ప హవా వీస్తోంది. రీసెంట్ గా  'అమూల్‌' తన వ్యాపారం కోసం 'పుష్పక్ ది స్లైస్‌.. అమూల్ హావ్ స‌మ్ అమ్ములు, అర్జున్‌..' అనే కార్టూన్‌ను షేర్‌ చేసింది. దీనికి బన్నీ కూడా స్పందించాడు. దీంతో ఆ వాణిజ్య ప్రకటన వైరల్‌గా మారింది. దాంతో పుష్ప పై మరోసారి ట్రాఫిక్ పోలీస్ లు దృష్టి పెట్టారు.

  ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమంపై కార్యక్రమం చేపట్టారు. పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్‌ హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ఈ హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ట్విటర్‌ పేజీలో షేర్‌ చేశారు. ఆ ఫొటోపై 'హెల్మెట్‌ తప్పని  సరి.. తగ్గేదే లే..' అంటూ రాసి ఉంది. అలాగే 'హెల్మెట్‌ ధరించండి. అది మిమ్మల్ని కాపాడుతుంది.' అంటూ ట్వీట్‌ చేశారు పోలీసులు. ఇలా  హెల్మెట్‌ ధరించడంపై అవగాహన కల్పిస్తే జనాల్లోకి బాగా వెళ్తుందని పోలీసులు భావించినట్లు తెలుస్తోంది.

ఇంతకు ముందు అంటే రిలీజ్ కు ముందు ‘పుష్ప ది రైజ్’ సినిమా ద్వారా కూడా మరో మెసేజ్ ఇచ్చారు సైబ‌రాబాద్ పోలీసులు. అది కూడా ప్ర‌శ్న రూపంలో.. పుష్ప మూవీలో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించిన ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర ట్రైల‌ర్‌లో పార్టీ లేదా? పుష్ప అని అంటాడు.. దానిపై చాలా మీమ్స్ కూడా వ‌చ్చాయి. ఇప్పుడు సైబ‌రాబాద్ పోలీసులు దాన్ని పాజిటివ్ యాంగిల్‌లో ఉప‌యోగించుకున్నారు. అదెలాగంటే.. పుష్ప సినిమాలో బ‌న్నీ బైక్ తోలే పోస్ట‌ర్ ఉంది.

 అందులో ఆయ‌న హెల్మెట్ వేసుకోడు.. బైక్‌కి సైడ్ మిర్ర‌ర్స్ ఉండ‌వు. ‘హెల్మెట్‌, సైడ్ మిర్ర‌ర్స్ లేవా పుష్ప‌.. ’ అంటూ ఫహాద్ ఫాజిల్ ప్రశ్నించేలా మీమ్‌ పోస్టర్‌ను త‌యారు చేసిన సైబ‌రాబాద్ పోలీసులు దాన్ని త‌మ అధికారిక వెబ్ సైట్‌లో పోస్ట్ చేశారు. దీంతో పాటు హెల్మెట్ ధ‌రించండి, రే వ్యూ మిర్ర‌ర్ ఫిక్స్ చేసుకుని సుర‌క్షితంగా ఉండండంటూ మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు స‌ద‌రు ట్వీట్ నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది.

Follow Us:
Download App:
  • android
  • ios