రూల్స్ బ్రేక్ చేస్తే.. ఎవరైనా ఒకటే అని నిరూపించారు తెలంగాణ పోలీసులు. సెలబ్రిటీల కార్లను కూడ వదలకుండా ఫైన్ వేశారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కార్ కూడా ఉంది. ఇంతకీ బన్నీ కార్ తో ఏ రూల్స్ ను బ్రేక్ చేశాడు.  

రూల్స్ బ్రేక్ చేస్తే.. ఎవరైనా ఒకటే అని నిరూపించారు తెలంగాణ పోలీసులు. సెలబ్రిటీల కార్లను కూడ వదలకుండా ఫైన్ వేశారు. అందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కార్ కూడా ఉంది. ఇంతకీ బన్నీ కార్ తో ఏ రూల్స్ ను బ్రేక్ చేశాడు. 

సినీ నటుడు అల్లు అర్జున్‌ కారుకు జరిమానా విధించారు జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు. శనివారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని నీరూస్‌ చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తున్న పోలీసులు అటుగా వెళ్తున్నఅల్లు అర్జున్‌ కారును ఆపారు. ఆయన కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించారు. అంతే కాదు నిబంధనలకు విరుద్థంగా బ్లాక్ ఫిల్మ్ వేసుకున్నందుకు 700 ఫైన్ కూడా వేశారు. 

అంతే కాదు అదే దారిలో వచ్చిన మరో హీరో కల్యాణ్‌ రామ్‌ కారును కూడా పోలీసులు ఆపారు. ఈ కారకు కూడా బ్లాక్ ఫీల్మ్ ఉండటంతో దాన్నితీసేశారు. ఫైన్ కూడా వేశారు. ఒక్క బ్లాక్ ఫిల్మ్ విషయంలోనే కాదు.. వాహనాల నంబర్‌ ప్లేట్లపై వంకర టింకరగా అంకెలు రాయడం.. లాంటి ట్రాఫిక్ రూల్స్ కు విరుద్థంగా వ్యవహరించేవారిని వదిలిపెట్టేది లేదు అని హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. నిబంధనలను పాటించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో ట్రాఫిక్‌ పోలీసులు వారం రోజులుగా నగరంలో స్పెషల్ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. అందులో బాగంగా 16,937 కేసులు నమోదు చేశారు. నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ కేసులు 9,387, సౌండ్ పొల్యూషన్ చేస్తున్న వెహికిల్స్ పై 3,270 కేసులు, బ్లాక్‌ ఫిల్మ్‌ అంటించి తిరుగుతున్న వాహనాలపై 4,280 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రతీ ఒక్కరు ఆర్టీఏ జారీ చేసిన నంబర్‌ ప్లేట్‌ను బిగించాలి. తెల్ల ప్లేట్‌పై నల్ల అక్షరాలతో నంబర్‌ రాయించాలి. నిబంధనలకు లోబడిన సైజ్‌లోనే నంబర్‌ ప్లేట్‌, అంకెలు ఉండాలి.ఫ్యాన్సీ, ఫైబర్‌, ప్లాస్టిక్‌ అక్షరాలు నిషేధం.బైక్‌, కార్లపై పేర్లు, బొమ్మలు, ఆర్ట్స్‌ వేయడానికి వీల్లేదు. కారు అద్దాలకు నల్ల ఫిల్మ్‌ వాడకూడదు. వాడితే 70 శాతం వెలుతురు లోపలికి వచ్చేలా ఉండాలి. అలాంటి విండ్‌ షీల్డ్‌ ఉపయోగించాలి. ఈవిషయంలో ఎంతటి సెలబ్రిటీలు అయినా సరే చర్యలు తప్పనిసరి అంటున్నారు పోలీసులు.