బేబి సినిమా యూనిట్ కి షాక్... నోటీసులు ఇస్తామన్న పోలీస్ కమిషనర్!
టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ బేబీ చిత్ర యూనిట్ కి షాక్ తగిలించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆ చిత్ర కంటెంట్ పై మండిపడ్డారు.

ట్రైయాంగిల్ లవ్ స్టోరీ బేబీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కేవలం ఐదారు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. దర్శకుడు సాయి రాజేష్ బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో-హీరోయిన్ గా నటించారు. విరాజ్ కీలక రోల్ చేయడమైంది. ఈ చిత్రంతో వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.
ఇదిలా ఉంటే బేబీ చిత్ర కంటెంట్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు డ్రగ్ కల్చర్ ని ప్రోత్సహించేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. బేబీ చిత్రంలో ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో రైడ్ జరిగిన సన్నివేశాలు ఉన్నాయి. బేబీ చిత్ర యూనిట్ కి నోటీసులు జారీ చేస్తామని ఆయన చెప్పడం సంచలనంగా మారింది.
బేబీ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ కాగా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. బేబీ చిత్రంపై కమిషనర్ సీవీ ఆనంద్ చేసిన కామెంట్స్ కి చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.