మ్యాస్ట్రో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ కు హైదరాబాద్ సిద్ధం.. హాజరుకానున్న మంత్రి కేటీఆర్, చిరంజీవి, నాగార్జున!

మ్యాస్ట్రో ఇళయరాజా (Ilaiyaraaja) హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు. ఆయన స్వయంగా స్టేజీ పెర్ఫామెన్స్ ఇవ్వబోతుండటంతో హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించి వివరాలు తాజాగా అందాయి. 
 

Hyderabad is all set for Maestro Ilaiyaraaja tribute concert

సంగీత ప్రియులు మ్యాస్ట్రో ఇళయరాజా అంటే ఎంతటి గౌరవం, అభిమానమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది ప్రేక్షకులను తన పాటలతో కట్టిపడేసిన సంగీత విధ్వంసుడు ఇళయరాజా చాలా కాలం తర్వాత మళ్లీ హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు. ఈ సంగీత దిగ్గజాన్ని సత్కరించేందుకు హైదరాబాద్ టాకీస్ మరియు మెర్క్యూరీ సంస్థలు అద్భుతమైన మ్యూజిక్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐదేండ్ల తర్వాత హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్న ఇళయరాజాను ఘనంగా సత్కరించేందుకు సినీ తారలు, రాజకీయ వేత్తలను కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆహ్వానించారు. 

ఈనెల ఫిబ్రవరి 25, 26న గచ్చిబౌళి స్టేడియంలో సాయంత్రం 6.30 నిమిషాలకు ఈ లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది. ఫిబ్రవరి 26న ఈ వేడుకకు ఇళయరాజా హాజరుకానున్నారు. అంతేకాకుండా సంగీత ప్రియుల కోసం తానే స్వయంగా స్టేజీపై లైవ్ పెర్ఫామెన్స్ కూడా ఇవ్వబోతుండటం విశేషం. ఈ సందర్భంగా సంగీతప్రియులు, ఇళయరాజా ఫ్యాన్స్ ఈవెంట్ ను విజయవంతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే ఈ కాన్సర్ట్ కు హాజరు కావాలని అతిథులను కూడా ఆహ్వానించారు నిర్వాహకులు. 

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, సాంస్కృతిక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆహ్వానించారు. ఈ వేడుకకు హాజరై సంగీత దిగ్గజాన్ని సత్కరించాలని అభ్యర్థించారు. అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి కొణిదెల, కింగ్, అక్కినేని నాగార్జుననూ ఆహ్వానించారు. కచేరీలో అనేక మంది ప్రముఖులతో కలిసి మంత్రి కేటీఆర్ ఇళయరాజాను సత్కరించబోతున్నారు. ఇళయరాజా రాకాపై చిరంజీవి, నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. 

ఫిబ్రవరి 25 (రేపు)న, మాస్ట్రో ఇళయరాజా లైవ్ కాన్సర్ట్‌కి ఒకరోజు ముందుగా ట్రిబ్యూట్ కాన్సర్ట్ ఉంటుంది. ఈ కచేరీలో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్, విశాల్ చంద్రశేఖర్, హైదరాబాద్‌లోని ప్రఖ్యాత బ్యాండ్‌లు, స్టార్ లైన్ లో ఉన్న సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పెర్ఫామ్ చేయబోతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 26న మాస్ట్రో ఇళయరాజా ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని వివరించారు. ఈవెంట్‌ను చూసేందుకు దాదాపు 20,000 మందికి పైగా హాజరవుతారని భావిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios