లక్కీ మీడియా సంస్థలో  9వ  చిత్రంగా వస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' అన్ని హంగులతో ఈ నెల డిసెంబర్ 14న విడుదల అవుతుంది .ఇటీవలే ఎంతో ఉత్సాహంగా బస్సు టూర్ లో భాగంగా  తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్  లోని  అన్ని ప్రధాన నగరాల్లో కాలేజీలకు 'హుషారు' టీం విశేష ఆదరణ పొందింది. వెళ్లిన ప్రతీ కాలేజీలో వేల సంఖ్య లో విద్యార్థులు స్వాగతం పలికి 'హుషారు' సినిమాలో ఎంతో ట్రెండింగ్ లో ఉన్న 'వెళ్ళిపోమాకే',  'పిచాక్' పాటలను ఆడి, పాడి  మూవీ టీంలో ఇంకా ఉత్సాహాన్ని పెంచారు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నఈ సినిమాని ఈ నెల 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'హుషారు' సాంగ్స్ తోనే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన ఈ 'హుషారు' ఇంకా కుర్రకారుని  ఎన్ని కొత్త స్టెప్పులు వేయిస్తుందో మీరే చూస్తారు అని సక్సెస్ ఫుల్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ అన్నారు.

బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ హుషారు కి రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు .తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు.రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు.