Asianet News TeluguAsianet News Telugu

`శాకుంతలం` కోసం బుడాపెస్ట్ ఆర్కేస్ట్రా టీమ్‌ ఆర్‌ఆర్‌ సెషన్‌.. వీడియో రిలీజ్‌

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న `శాకుంతలం` చిత్రం విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం ఆర్‌ ఆర్‌ సెషన్‌లో భాగంగా హంగేరీకి చెందిన బుడాపెస్ట్ ఆర్కేస్ట్రా వర్క్ చేయడం విశేషం

hungary budapest orchestra work for shaakuntalam rr sessions
Author
First Published Jan 5, 2023, 2:14 PM IST

సమంత నటిస్తున్న భారీ మూవీ `శాకుంతలం`. పురాణాల ఆధారంగా శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు గుణశేఖర్‌. ఎపిక్‌ లవ్‌ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. సీజీ, రీరికార్డింగ్‌ వర్క్ జరుపుకుంటోంది. గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మరింత గ్రాండియర్‌ లుక్‌ తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు మేకర్స్. 

రీరికార్డింగ్‌ విషయంలో అంతర్జాతీయ క్వాలిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా హంగేరీ చెందిన ఆర్కేస్ట్రాతో బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ రీ రికార్డింగ్‌ వర్క్ చేయిస్తుండటం విశేషం. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోని `శాకుంతలం` ఆర్‌ఆర్‌ సెషన్‌ పేరుతో విడుదల చేసింది యూనిట్‌. ఇందులో సుమారు యాభై మందితోకూడిన బుడాపెస్ట్ సింఫోనీ ఆర్కేస్ట్రా బృందం వినసొంపైన, పీరియాడిల్‌ ఫ్లేవర్‌ వచ్చేలా ట్యూన్‌ కంపోజ్‌ చేయడం విశేషం. ట్యూన్‌ చేస్తున్న సమయంలో తీసిన వీడియోని పంచుకుంది `శాకుంతలం` టీమ్‌. సంగీత దర్శకుడు మణిశర్మ సారథ్యంలో ఇది జరగ్గా, విడుదలైన వీడియో ఆద్యంతం ఆకట్టుకుని వైరల్‌ అవుతుంది.

సమంత.. శకుంతలగా నటిస్తున్న ఈ చిత్రంలో దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తుండగా, గుణ టీమ్‌ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ చివరి దశకు చేరుకుంటున్నట్టు సమాచారం.  
 

Follow Us:
Download App:
  • android
  • ios