బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఓ హిందీ వార్తా ఛానెల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. సల్మాన్ ఖాన్ సోదరుడు సొహైల్ ఖాన్ తన భార్య సీమా ఖాన్ తో కలిసి ఇటీవల 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కి హాజరయ్యారు.

ఆ సినిమా చూడడానికి హుమా ఖురేషీ కూడా వెళ్లింది. హుమా, సొహైల్ ఒకప్పుడు ప్రేమించుకున్నారని బాలీవుడ్ లో వార్తలు వినిపించేవి. దీంతో ఓ వార్తా ఛానెల్ దీని గురించి ఓ వార్త రాసింది. స్పెషల్ స్క్రీనింగ్ చూడడానికి వచ్చిన సొహైల్ దంపతులు, హుమాని పట్టించుకోకుండా వెళ్లిపోయారని.. దీంతో ఆమె చాలా బాధ పడ్డారని వార్తలు ప్రచురించింది.

ఇది హుమా వరకు వెళ్లడంతో ఆమె సదరు ఛానెల్ పై మండిపడింది. 'మీ చెత్త ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇవ్వలేదని నా గురించి ఇలాంటి చెత్తంతా రాస్తారా..? మీకు సిగ్గు లేదా..?' అంటూ ఫైర్ అయింది.

'నా పేరుని చెడగొట్టడానికి మీకెంత ధైర్యం.. ఇలా చేసినందుకు నాకు సొహైల్ దంపతులకు క్షమాపణలు చెప్పండి'' అంటూ మండిపడింది. ఎంతమాత్రం ఎథిక్స్ లేవని, మీలాంటి ఇడియట్స్ ని నటీనటులు పట్టించుకోరని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.