ఆరడుగుల ఆజానుబాహుడు రానా విభిన్నమైన పాత్రలతో దేశవ్యాప్తంగా తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బాహుబలి, ఘాజి లాంటి చిత్రాలు రానాని నార్త్ ఆడియన్స్ కు పరిచయం చేశాయి. ప్రస్తుతం రానా విరాటపర్వం 1992 చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్. 

ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషితో కలసి రానా లంచ్ మీటింగ్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాలిఫోర్నియాలోని ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో వీరిద్దరూ కలుసుకున్నారు. అక్కడ ఇండియన్ ఫుడ్ వండుకుని మరీ డిన్నర్ చేశారు. 

హ్యూమా క్యురేషి, రానా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రానా అనారోగ్యంతో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ రానా మాత్రం ఫిట్ గానే కనిపిస్తున్నాడు.